పొరపాట్లు మానవ సహజం. అయితే మరీ కంప్యూటర్స్ కాలంలో పొరపాట్లు ..వాటిని మనుష్యులపై నెట్టేయలేము. అందులోనూ కొన్ని పొరపాట్లు కామెడీగా ఉంటాయి. ఆ పొరపాటు వలన కొందరికి ఇబ్బంది కలగొచ్చు ఏమో కానీ, మిగతావాళ్లకు వినోదం మిగులుతుంది. ఇప్పుడు అనుపర పరమేశ్వరన్ ఫొటో ...హాల్ టిక్కెట్ పై కనపడటంతో అదే పరిస్దితి నెలకొంది. ఆ అభ్యర్దికి ఏం చేయాలో పాలు పోలేదు.

మొదట అసలు ఆమెను గుర్తు పట్టలేదు. ఎవరో అమ్మాయి ఫొటో తన హాల్ టిక్కెట్ మీదకు ఎలా వచ్చిందో అని బిక్క మొహం వేసాడు. ఆ తర్వాత ఆమె సౌత్ లో స్టార్ హీరోయిన్ అని తెలిసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి రచ్చ రచ్చ చేసారు.  వివరాల్లోకి వెళితే...బీహార్లో టీచర్ పోస్టు కోసం నిర్వహించే ఎస్ టెట్ ఎగ్జామ్ కోసం జారీ చేసిన హాల్ టికెట్ లో అనుకోని విధంగదా అనుపమా పరమేశ్వరన్ ఫొటో ప్రత్యక్ష్యమయ్యింది.

హాల్ టికెట్ మీదున్న పేరు రిషికేష్ కుమార్ కాగా.. బీహార్ లో నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్లో ఓ కుర్రాడి ఫోటోకు బదులు అనుపమ ఫోటో రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  మక్దుంపుర్లో నివశించే రిషికేశ్ కుమార్ టీచర్ పోస్ట్ కు ఎలిజిబులిటీ సాధించేందుకు ఎస్ టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 28న జరిగే పరోక్ష కోసం ఆన్ లైన్ లో హాల్ టికెట్లు విడుదల చేసింది బోర్డు. తన అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసి చూసుకున్న రిషికేశ్ షాక్ అయ్యాడు.

ఆ హాల్ టికెట్ లో డిటేల్స్ అన్నీ తనవే అయినా.. ఫోటో మాత్రం సౌత్ ఇండియన్ అనుపమది ఉండటంతో వెంటనే సంభందింత అధికారులను సంప్రదించాడు. వాళ్లు తప్పును దిద్దుకునే లోపే విషయం బయటకు వచ్చి సోషల్ మీడియా సాక్షిగా  పరువు పోయింది.   గతంలో ఒకసారి బీహార్ లో ఇలాగే ఓ ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లో సన్నీలియోన్ ఫోటో రావడం కలకలం రేపిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు వారి సాధిస్తున్న ఘనకార్యాలు ఇవే మరి.