రవితేజకు అనుపమ్ ఖేర్ క్షమాపణలు, షాకింగ్ వీడియో వైరల్.. కారణం ఏంటీ..?
బాలీవుడ్ లెజండరీ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ .. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజకు క్షమాపణలు చెప్పారు. అంతటి బాలీవుడ్ స్టార్.. రవితేజ కు క్షమాపణలు చెప్పడం ఏంటి..? ప్రస్తుంతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో రవితేజకు అనుపమ్ ఎందుకు క్షమాపణలు చెప్పారు.. ?
బాలీవుడ్ లెజండరీ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ .. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజకు క్షమాపణలు చెప్పారు. అంతటి బాలీవుడ్ స్టార్.. రవితేజ కు క్షమాపణలు చెప్పడం ఏంటి..? ప్రస్తుంతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో రవితేజకు అనుపమ్ ఎందుకు క్షమాపణలు చెప్పారు.. ?
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్.. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజకు క్షమాపణలు చెప్పారు. అవును ఇదేదో గాసిప్ కాదు.. వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్ కాదు.. సాక్ష్యాత్తు సాక్ష్యంగా ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇంతకీ అంతటి పెద్ద స్టార్.. మన తెలుగు హీరోకు క్షమాపణలు చెప్పడం ఏంటీ.. అని అంతా ఆశ్చర్యపోతున్నారు ఇంతకీ అనుపమ్ ఖేర్ ఎందుకు సారి చెప్పాడు. బాలీవుడ్ స్టార్స్ లిస్ట్ లో టాప్‌లో ఉంటాడు దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్. ఈ సీనియర్ యాక్టర్ టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja)ను క్షమాపణలు అడిగాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
అసలు ఇద్దరి మధ్య క్షమాపణలు చెప్పుకునేంతగా ఏం జరిగింది అనేది అందరి డౌట్. రవితేజ తొలి పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిసిందే. టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. తాజాగా హిందీ ప్రమోషన్స్ లో చేసిన చిట్‌చాట్‌లో అనుపమ్ ఖేర్, రవితేజ మధ్య జరిగిన ఓ సంఘటన కి చెందిన వీడియో వైరల్ అవుతోంది. ఈసందర్భంగా అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. 1988లో రవితేజ నాతో ఫొటో దిగుతానని అడిగాడు. కానీ నేను తిరస్కరించానన్నాడు అనుపమ్ ఖేర్. అయితే అప్పట్లో తన దురుసు ప్రవర్తనను గుర్తు చేసుకొని.. రవితేజకు క్షమాపణలు చెప్పారు అనుపమ్ ఖేర్. ఇప్పుడీ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
1970స్ లో స్టూవర్ట్‌పురంలో ఫేమస్ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్ రావు జీవితం ఆధారంగా పాన్ ఇండియా స్టోరీతో తెరకెక్కుతుంది ఈసినిమా ఈ చిత్రానికి వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.