ప్రస్తుతం బిగ్ బాస్ షో ఇండియా మొత్తం బాగా పాపులర్ అయింది. అన్ని భాషల్లో బిగ్ బాస్ షో కు మంచి ఆదరణ లభిస్తోంది. బిగ్ బాస్ షో ద్వారా పలువురు ఆర్టిస్ట్ లు సెలెబ్రిటీలు గా మారిపోతున్నారు. ప్రముఖ సింగర్ అనూప్ జలోటా, యువగాయని జస్లీస్ మతారు హిందీ బిగ్ బాస్ 12 సీజన్ లో పాల్గొన్నారు. 

బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరి ప్రేమ వ్యవహారం అభిమానులకు సైతం షాకిచ్చింది. వీరిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నట్లుగా హౌస్ లో ప్రవర్తించారు. బయటకు వచ్చాక కూడా వీరిద్దరి రిలేషన్ గురించి రూమర్స్ ఆగలేదు. 

వీరిద్దరి గురించి ఓ వార్త సామజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇటీవల జస్లీస్ నుదిటిన సింధూరం, చేతికి గాజులు వేసుకుని ఓ పాటకు డాన్స్ చేసింది. ఆ వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీనితో అనూప్ జలోటా, జస్లీస్ వివాహం చేసుకున్నారని నెటిజన్లు అంతా భావించారు. 

లాక్ డౌన్ లో వీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అయ్యాయి. దీనిపై అనూప్ జలోటా స్పందించారు. జస్లీన్ నా శిష్యురాలు.. ఆమె నా కుమార్తె లాంటిది. ఆమెతో నాకు పెళ్లేంటి అని అనూప్ ప్రశ్నించారు. ఆమె తండ్రి నాకు బాగా తెలుసు. జస్లీస్ కు వివాహం చేసేందుకు ఆమె తండ్రితో కలసి ప్రస్తుతం తాను ఓ వరుడిని వెతుకుతున్నట్లు అనూప్ తెలిపారు. తమ మధ్య దాదాపు 35 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉందని అనూప్ తెలిపారు.