అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా టీం విశాఖలో సందడి చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి మూవీ టీం విశాఖలో పర్యటించి సందడి చేసింది. నగరంలోని వివిధ ఆలయాలను దర్శించుకున్న మూవీ టీం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాలేజీలకు వెళ్లి ప్రమోట్ చేస్తూ సందడి చేస్తున్నామని.. మంచి ఆదరణ చూపిస్తున్నారని మూవీ టీం సంతోషం వ్యక్తం చేశారు.  

విశాఖ నగరంలోని గవర్నర్ బంగ్లా వద్ద స్టూడియో ఎమ్ లో మూవీ టీం సందడి చేసింది. స్టూడియో ఎమ్ లో  ఉన్న వివిధ జిమ్ లను, స్టూడియో లు, జుంబా డాన్స్ ఫ్లోర్ ను, బొటీక్ ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో, మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో హీరోయిన్లు గా ధన్య బాలకృష్ణన్, కోమలీ ప్రసాద్,  సిద్ధి ఇద్నాని, త్రినాథ చౌదరి హీరోయిన్లు గా నటించారు. ఈ నలుగురే సినిమాలో హీరోలని, నలుగురు స్నేహితులు ఎదుర్కొన్న సమస్యలు, ఎలా బయట పడ్డారన్న అంశమే మూవీలో చూపిస్తున్నామని హీరోయిన్ ధన్య బాలకృష్ణన్ అన్నారు. 

కామెడీ, ఎంటర్టైన్మెంట్, సస్పెన్స్ ఈ సినిమా లో వుంటుందని సినిమా సక్సెస్ చెయ్యాలని కోరారు. విశాఖలో పర్యటించడం సంతోషంగా ఉందన్నారు. ఇక మరో హీరోయిన్ కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ.. మితిమీరిన ఎంజాయ్ మెంట్ తర్వాత నలుగురు హీరోయిన్లు పడే ఇబ్బందులను ప్రధానంగా ఈ సినిమాలో చూపించారని.. సినిమా చాలా బాగా వచ్చిందని అన్నారు. వాళ్ళు ఎలా ఆ సమస్యల నుంచి బయట పడతారు అనేది సినిమాలో ప్రధాన అంశంగా ఉంటుందని మరో హీరోయిన్ త్రిధా చౌదరి తెలిపారు.  

అందమైన విశాఖలో తొలి సారి సినిమా ప్రమోషన్ కోసం వచ్చామని.. మంచి రెస్పాన్స్ లభించిందని త్రిధా చౌదరి తెలిపారు. డైరెక్టర్ బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ సినిమా కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ చిత్రంగా వస్తుందని.. నలుగురు హీరోయిన్లు ఈ చిత్రంలో మంచి ప్రతిభ కనబరిచారని.. నలుగురు స్నేహితుల మధ్య కలిసి ఎంజాయ్ చేయడం తర్వాత సడన్ గా వచ్చే సమస్యల నుంచి ఎలా బయటపడతారన్నది ప్రధానంగా చూపిస్తున్నామని తెలిపారు. 

ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి విజయవంతం చేయాలని డైరెక్టర్ బాలు ప్రేక్షకులను కోరారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ సినిమా, మ్యూజిక్ ఇప్పటికే రిలీజ్ అయిందని.. ప్రేక్షకులు ట్రైలర్ కు మంచి స్పందన చూపిస్తున్నారన్నారు. ఈ సినిమా ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్లు హిమా వెలగపూడి, వేగి శ్రీనివాస్ ఇతర సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి చిత్రం అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన చిత్రం. ఈ మధ్యన ఇలాంటి చిత్రాలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. జోరుగా ప్రచారం చేస్తూ మంచి బజ్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.