అడల్ట్స్ చిత్రాల జోరు మళ్లీ ఈ మధ్యన ఊపందుకుంది. ఆర్ ఎక్స్ 100 హిట్ తర్వాత మొదలైన ఈ ప్రభంజనం...ఏడు చేపల కథ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ తో మరింత ఉత్సాహం తెచ్చుకుని రెచ్చిపోతోంది. తాజాగా ఈ వరసలో ‘అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి’ అనే చిత్రం చేరింది. సాధారంగా మన సినిమాల్లో నలుగురు కుర్రాళ్లు ఓ రిసార్ట్ కో మరో చోటకో అవుటింగ్ కు వెళ్తూంటారు. అక్కడ అమ్మాయిలు...తాగుడు, చివర్లో చిన్న క్రైమ్ లో ఇరుక్కోవటంతో కథలు ఎండ్ అవుతూంటాయి. అయితే ఈ సారి కొత్త ట్విస్ట్ ని పాత కథకే ఇచ్చినట్లున్నారు. మగ వాళ్ల ప్లేస్ లో అమ్మాయిలను  పెట్టారు.

ఓ నలుగుర అమ్మాయిలు గోవా వెళ్లి అక్కడ ఓ మేల్ ఎస్కార్ట్ ని బుక్ చేసుకోవటం , ఓ రిసార్ట్ లో ఎంజాయ్ చేయాలనుకోవటం,అనుకోకుండా ఆ ఎస్కార్ట్ మర్డర్ అవటం చుట్టు తిరిగే క్రైమ్ కథ ఇది. అడల్ట్ కామెడీగా సాగే ఈ సినిమా ట్రైలర్ వదిలారు. ట్రైలర్ ఇంట్రస్టింగ్ గానే ఉంది. అమ్మాయిలతో కొద్ద్గిగా హాట్ డైలాగులే చెప్పించారు.

దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ.. మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. హైదరాబాద్‌లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని' అన్నారు.  

ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు.