Asianet News TeluguAsianet News Telugu

పాపం అను ఇమ్మాన్యుయేల్.. ఈ సారి పూర్తి నిరాశే

 అను ఇమ్మాన్యుయేల్ కెరీర్‌లో, చాలా సినిమాలు ఫెయిల్యూర్స్,  హిట్ లేదా పెద్ద బ్లాక్‌బస్టర్‌లు దాదాపు లేవనే చెప్పాలి. 

Anu Emmanuel disastrous streak continues with Japan movie JSP
Author
First Published Nov 12, 2023, 2:13 PM IST | Last Updated Nov 12, 2023, 2:13 PM IST

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కొలమానంగా కెరీర్ లు ముందుకు వెళ్తూంటాయి. అయితే సినిమా హిట్ అయితే తమ ప్రమోయం లేనివారికి కూడా ఎలా ఆఫర్స్ వస్తాయో..సినిమా పోయినప్పుడు అందరి మీద ఆ ముద్రపడుతుంది. అయితే  హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్ తో సంభందం లేకుండా ఆమె ప్రతిభను చూసి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆమె సినిమా వరసగా ఫెయిల్యూర్ అవుతు వస్తున్నాయి.  అయినా తెలుగు దర్శక,నిర్మాతలు పిలిచి ఆఫర్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఆమెకు డిజాస్టర్ పడింది. 

అను ఇమ్మాన్యుయేల్ తెలుగు,తమిళంలో స్టార్స్ తో పనిచేసినప్పటికీ ఆమెకు పెద్దగా కలిసివచ్చినట్లు కనిపించదు. అను ఇమ్మాన్యుయేల్ కెరీర్‌లో, చాలా సినిమాలు ఫెయిల్యూర్స్,  హిట్ లేదా పెద్ద బ్లాక్‌బస్టర్‌లు దాదాపు లేవనే చెప్పాలి. ఆమె తొలి చిత్రం నానితో చేసిన మజ్ను..జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత వరస పెట్టి డిజాస్టర్స్ వచ్చాయి. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాశి, శైలజా రెడ్డి అల్లుడు, మహా సముద్రం, రావణాసుర, నా పేరు సూర్య అల్లుడు అదుర్స్ ఇలా ..అయితే ఉన్నంతలో  అల్లు శిరీష్ కు జోడీగా రాకేశ్ శశి డైరెక్షన్ లో చేసిన ఊర్వశివో రాక్షసివో సినిమా ఆడింది.

 కెరీర్ లో సరైన విజయం లేని అను ఇమ్మాన్యుయేల్ జపాన్ సినిమా పై ఆశలు పెట్టుకుంది. కార్తీకి జోడీగా నటించే అవకాశాన్ని అను ఇమ్మాన్యుయేల్ సొంతం చేసుకున్నారని  చాలా ఆనందం పడింది. తమిళంలో పేరున్న దర్శకుడు రాజు మురుగన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.  ఈ సినిమాకు సక్సెస్ వస్తే అను ఇమ్మానుయేల్ జాతకం మారిపోతుందని అందరూ అన్నారు. అను ఇమ్మాన్యుయేల్ ఫ్లాప్ హీరోయిన్ ఇమేజ్ ను పోగొట్టుగోబోతోందని కామెంట్లు వినిపించాయి. అయితే జపాన్ డిజాస్టర్ అయ్యింది. నవంబర్ 10న రిలీజ్ అయిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయని చెప్పాలి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios