సీనియర్ యాక్టర్ ఆనంద్ రాజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది . ఆయన సోదరుడు కనకసబై ఆత్మహత్య చేసుకోవడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సూర్యవంశం - పెద రాయుడు వంటి సినిమాల్లో విలన్ గా నటించి 90లలో స్టార్ యాక్టర్ గా కొనసాగిన ఆనంద్ రాజ్ అందరికి సుపరిచితమే. అయితే ఇటీవల ఆయన తమ్ముడు కనకసబై ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది.

ఆర్థిక కారణాల వల్లే ఆయన సూసైడ్ చేసుకొని ఉంటారని సన్నహితులు తెలిపారు. అవివాహితుడైన కనకసభై చిట్టీల వ్యాపారం వడ్డీ వ్యాపారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఆ వ్యాపారాల్లో తీవ్రంగా నష్టం రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వచ్చాయి. అయితే ఈ కేసులో పోలీసులకు మరొక ఆధారం దొరకడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు.  ఘటనపై నటుడు ఆనంద్ రాజ్ తీవ్ర ఆవేదన చెందుతూ తన తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఎదో కుట్ర దాగి ఉందని తెలిపారు.

ఇక మరొక   వాటిలో నష్టం కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావించారు. మరీంత లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు ఒక లేఖను కనుగొన్నారు. కనకసభై ఆత్మహత్య చేసుకొవడం వెనుక ఎవరున్నారు అనే విషయాన్నీ లేఖలో పేర్కొన్నట్లు ఉంది. తన అన్నయ్య భాస్కర్ అతని కొడుకు శివ చంద్రన్ వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నాను అని లేఖలో రాసినట్లు ఉండడంతో విచారణ జరిపిన పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జైలుకి తరలించారు.