సూపర్ స్టార్ రజినీకాంత్ మరో బిగ్ బడ్జెట్ మూవీకి సిద్దమవుతున్నాడు. చాలా రోజుల తరువాత ఆయన మరో స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ వరుసగ కథలను ఒకే చేస్తూ బిజీ బిజీ అవుతున్నారు. ఇప్పటికే దర్బార్ ని పూర్తి చేసిన తలైవా నెక్స్ట్ శివ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు.

అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి రజిని ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో రజినీతో పాటు మరో స్టార్ హీరో కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతనెవరో కాదు.. మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్. ఇటీవల కాలంలో మోహన్ లాల్ స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్నారు.

కథలో పాత్ర నచ్చితే రెమ్యునరేష్ తో సంబంధం లేకుండా సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా గౌతమ్ మీనన్ మోహన్ లాల్ కి కథ చెప్పడంతో సూపర్ స్టార్ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ దర్బార్ సినిమా జనవరిలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాపై తమిళ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఆ సినిమా రిలీజ్ అనంతరం శివ ప్రాజెక్ట్ తో రజిని బిజీ కానున్నాడు. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే గౌతమ్ మీనన్ ప్రాజెక్ట్ ని కూడా సెట్స్ పైకి తేవాలని తలైవా ప్లాన్ చేసుకుంటున్నాడు. మొత్తంగా వచ్చే ఏడాది లోపు సినిమా పనులను పూర్తి చేసుకొని రాజకీయాలతో బిజీ కావాలని రజినీకాంత్ తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.