ప్రిన్ మహేష్ బాబు  తన సహృదయాన్ని మరోసారి  చాటుకున్నాడు. నెలరోజుల శిశువుకు ఉచితంగా ఆపరేషన్ చేయించి రియల్ హీరో అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్, నాగజ్యోతి దంపతులకు అరుదైన గుండె జబ్బుతో బిడ్డ పుట్టింది. ఆమె శరీరంలో చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోతోంది.బిడ్డ తల్లితండ్రులు బీదవారు. వారికి ఆపరేషన్ చేయించే స్దోమత లేదు. 

దాంతో ఓ వ్యక్తి ద్వారా ఈ  విషయాన్ని తెలుసుకున్న మహేశ్ బాబు, పాపకు కావాల్సిన చికిత్సను అందించాలని ఆంధ్రా హాస్పిటల్ డాక్టర్లకు సూచించారు. ఆపై తమ బిడ్డను తల్లిదండ్రులు ఆసుపత్రికి చేర్చగా, 2వ తేదీన శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ తరువాత పాప ఆరోగ్య పరిస్థితి కాస్తంత క్షీణించింది. బీపీ పడిపోవడం, గుండె కొట్టుకోవడంలో మార్పులు కనిపించడంతో, వైద్యులు పాపను   ఐసీయూకు తరలించారు. రెండు వారాల తరువాత పూర్తిగా కోలుకోవడంతో నిన్న డిశ్చార్జ్ చేశారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న మూవీ 'సర్కారు వారి పాట'. ఇప్పటికే ఈ మూవీకి చెందిన టైటిల్ పోస్టర్ చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఆ పోస్టర్ లో మహేష్ లుక్.. టాటూ.. హెయిర్ స్టైల్ మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  మహేష్ అభిమానులు కోరుకునే విధంగా ఈ మూవీ స్క్రిప్ట్ ఉందనుందని టాక్.  

 గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్త సమర్పణలో నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు లాంటి బాక్సాఫీస్ హిట్ తర్వాత మహేష్ 'సర్కారు వారి పాట' తో చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.