2002లో వచ్చిన జయం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. హీరో నితిన్ ఆ సినిమాతోనే స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చాడు. విలన్ గా గోపీచంద్ కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు ఇక 2003లో తమిళ్ లో అదే టైటిల్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. 18 ఏళ్ల తరువాత మరో భాషలో జయం కథ రూపొందుతోంది. డాక్టర్ చదివిన ఒక కుర్రాడు యాక్టర్ గా మారి ఆ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇన్నోసెంట్ లవర్ బాయ్ లా కనిపిస్తున్న అతని పేరు.. ప్రవీణ్. కర్ణాటకకు చెందిన ఆ కుర్రాడు కన్నడ శాండిల్ వూడ్ లో జయం కథను రీమేక్ చేయబోతున్నాడు. గత ఏడాది నటనలో శిక్షణ తీసుకున్న ప్రవీణ్ మొత్తానికి ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు.  ప్రస్తుతం ఒక సినిమాతో బిజీగా ఉన్న ప్రవీణ్ నెక్స్ట్ జయం కథను రీమేక్ చేయబోతున్నాడు.

కొత్త టెక్నీషియన్స్ ద్వారా ఆ సినిమా రూపొందనుందట. ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సినిమాకు సంబందించిన అన్ని పనులు పూర్తయిన తరువాతే సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారు. రెగ్యులర్ వర్క్ షాప్స్ తో చిత్ర యూనిట్ పక్కా ప్లాన్ తో షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటోంది. జయం సినిమాతో నితిన్.. కెరీర్ కి సరిపడ క్రేజ్ ని అందుకున్నాడు. మరి అలాంటి కథతో స్మార్ట్ గా కనిపిస్తున్న ఈ కుర్రాడు ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.