టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న పూరి నెక్స్ట్ ఫైటర్ తో మరింత పెద్ద హిట్ అందుకోవాలని ఏకంగా ఫ్యాన్ ఇండియా ప్లాన్ వేశాడు. అందుకు పూరి టీమ్ కి బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ జతయ్యాడు.

సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇక నటీనటులను ఫైనల్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారు. ఇప్పటికే కరణ్ జోహార్ సలహాతో అతిలోక సుందరి తనయ జాన్విని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్న పూరిత జగన్నాథ్ మరో కథానాయికను కూడా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. కో ప్రొడ్యూసర్ ఛార్మితో కలిసి ముంబై లో బాలీవుడ్ హీరోయిన్స్ పై డిస్కస్ చేస్తున్నట్లు సామాచారం.

అంటే ఫైటర్ సినిమాలో జాన్వితో పాటు మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలకొనే చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. ఫైటర్ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించనున్నారు. కాబట్టి నార్త్ లో విజయ్‌ అరంగేట్రం ఈ చిత్రంతోనే జరుగుతుంది.

ఫైటర్ కథ విన్న కరణ్ జోహార్... ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించి పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రం 2020 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'వరల్డ్ ఫేమస్ లవర్' రూపొందుతోంది. ఆ తరువాత ఆయన సినిమాగా 'ఫైటర్' సెట్స్ పైకి వెళ్లనుంది.