దగ్గుబాటి హీరో వెంకటేష్ 2019ని సక్సెస్ తో మొదలు పెట్టి ప్లాప్ తో ఎండ్ కార్డ్ పెట్టాడు.  వరుణ్ తో చేసిన F2 సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఏడాది చివరకి వచ్చిన వెంకిమామ ఊహించని అపజయాన్ని అందించింది. మొత్తానికి మల్టీస్టారర్ సినిమాలతో  2019లో హడావుడి చేసిన  వెంకీ నెక్స్ట్ సింగిల్ గా సక్సెస్ ఆదుకోవాలని చూస్తున్నాడు.

వెంకీ మొదట అసురన్ రీమేక్ సినిమాతో రాబోతున్నాడు. షూటింగ్ కోసం చిత్ర యూనిట్ తో కలిసి అనంతపూర్ కూడా వెళ్ళాడు. ఎక్కువగా ఆ లొకేషన్స్ లోనే సినిమాని తెరకెక్కించబోతున్నారు. సినిమాకు నారప్ప అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రియమణి వెంకీకి జోడిగా నటించనున్న ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆమె మరెవరో కాదు. క్యూట్ బ్యూటీ అమలాపాల్.  అమలాపాల్ తో పాటు మరికొంత మంది కుర్ర హీరోయిన్స్ ని ఆ పాత్ర కోసం అనుకున్నప్పటికీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఫైనల్ గా అమలాపాల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా టైటిల్ తో పాటు వెంకటేష్ లుక్ కూడా ఇప్పటికే జనాల్లో హాట్ టాపిక్ గా మారింది. లుక్ మంచి బజ్ క్రియేట్ చేయడంతో త్వరలోనే మరొక లుక్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. మరీ ఈ సినిమాతో వెంకటేష్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.