రూమర్.. అనేది సినిమా ఇండస్ట్రీలో కామన్ పాయింట్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య రూమర్స్ డోస్ ఎక్కువవుతోంది. దిక్కుమాలిన అబద్దాలు నిజమనుకుంటూ పలు వెబ్ సైట్లు అదే పనిగా ప్రచారం చేస్తున్నాయి. దిల్ రాజు సెకండ్ మ్యారేజ్ పై కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మొదటి భార్య కాలం చేసిన విషయం తెలిసిందే.  అయితే దిల్ రాజుకి సెకండ్ మ్యారేజ్ చేయాలనీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆలోచిస్తున్నట్లు టాక్ వచ్చింది. పెళ్లి అనేది ఎంతవరకు నిజం అనేది తెలియదు. అయితే వధువు విషయంలో మాత్రం అబద్ధాలు కరోనా వైరస్ కంటే దారుణంగా పాకుతున్నాయి. హోమ్లీ గా ఉండడానికి ఇష్టపడే దిల్ రాజు ఇప్పుడు అమెరికా అమ్మాయిని పెళ్లాడడానికి ఇష్టపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి.

అంతే కాకుండా ఆమె ఒక ఎయిర్ హోస్ట్ అని దుబాయ్ లో మరో రెండు రోజుల్లో పెళ్ళని రాస్తున్నారు. ఇక కొందరైతే అనుష్క తో కూడా పెళ్ళని చెప్పడం విడ్డురం. మరీ ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. దిల్ రాజు టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇక 50 ఏళ్ల వయసులో దిల్ రాజు పెళ్లి చేసుకుంటే.. ఆయనకున్న క్రేజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది మరొక హాట్ పాయింట్. మరీ ఈ రూమర్స్ కి దిల్ రాజు ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తాడో చూడాలి.