గత ఏడాది భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో బాలీవుడ్ లో అయితే క్లిక్కయ్యింది గాని సౌత్ లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. దర్శకుడు సుజిత్ రెండవ అవకాశంతోనే 300కోట్ల భారీ బడ్జెట్ ని డీల్ చేసిన విధానం చిత్ర పరిశ్రమలో చాలా వరకు అందరిని ఆకర్షించింది.

సినిమా కాస్త క్లిక్కయినా కలెక్షన్స్ రేంజ్ పెరిగేది.  ఇకపోతే సుజిత్ కి సాహో సినిమా వల్లే ఆఫర్స్ అందుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. RRR అనంతరం ఆ సినిమాను స్టార్ట్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇకపోతే రామ్ చరణ్ మూవీ తరువాత సుజిత్ మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేయబోతున్నట్లు టాక్ వస్తోంది. రామ్ చరణ్ గత ఏడాది క్రితమే లూసిఫర్ రీమేక్ హక్కుల్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.

 మొదట సురేందర్ రెడ్డి , వినాయక్ వంటి దర్శకులు ఆ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు సుజిత్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం సుజిత్ రామ్ చరణ్ కోసం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. RRR షూటింగ్ అయిపోగానే కొత్త సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. మరీ ఆ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.