కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర మరో డిఫరెంట్ సినిమాతో రెడీ అవుతున్నాడు. తెలుగులో కూడా ఈ హీరోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చేసిన ప్రతి సినిమా ఎంతో కొంత క్రేజ్ తెస్తూనే ఉంది. ఉపేంద్ర సినిమాలంటే ఒక స్పెషల్ ట్రెండ్. ఇక ఇప్పుడు కబ్జ అనే మరో డిఫరెంట్ సినిమాను రెడీ చేసుకుంటున్నాడు.

గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది.  ఉపేంద్ర ప్రతి సినిమాలో ఎదో ఒక స్పెషల్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇక కబ్జా సినిమాలో మాత్రం రియాలిటీగా తగ్గట్టుగా ఏడుగురు మెయిన్ విలన్లు ఉంటారట.

ఏడు బాషల సినీ ప్రేక్షకులను ఆకర్షించేందుకు చిత్ర యూనిట్ ఈ విధంగా ప్లాన్ చేసింది. ఏడూ భాషలకు చెందిన యాక్టర్స్ ని సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నారు.బాలీవుడ్‌కు చెందిన నానా పటేకర్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రకాశ్‌రాజ్‌, జగపతి బాబు, జయప్రకాశ్ రెడ్డి, ప్రదీప్‌ రావత్‌, సముద్రఖణిలను విలన్‌ లుగా తీసుకున్నామన్నారు.

ఇక సినిమాలో గ్యాంగ్ స్టర్స్ కావాలని ఆడిషన్స్ నిర్వహించిన చిత్ర యూనిట్ దాదాపు 10వేల మందిని పరిశీలించారు.  వారందరిలో ముఖ్యమైన 500మందిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టిందట. ఆడియెన్స్ అంచనాలకు మించి సినిమాని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు చండ్రు ఇటీవల మీడియాకు వివరణ ఇచ్చాడు.

ఫ్యాన్ ఇండియన్ లెవెల్లో ఉపేంద్ర కూడా మంచి సినిమాతో సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ఈ నెల 15నుంచి సినిమా మొదటి షెడ్యూల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనుంది.