పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టి అభిమానులకు మంచి కిక్కిచ్చిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పింక్ రీమేక్ సినిమా వకీల్ సాబ్ సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు నిర్మాత దిల్ రాజు ముందుగానే  ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్క బోయే సినిమా కూడా త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇక వకీల్ సాబ్ సమ్మర్ ను దాటే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. మే నెలలో సినిమా వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నా అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఇక ఇప్పుడు పవన్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న వీరూపాక్షి కూడా మరీంత ఆలస్యం అయ్యేలా ఉంది. ఆ సినిమా కోసం ఇప్పటికే ఒక స్పెషల్ ప్లాన్ వేసుకొని డేట్స్ ఫిక్స్ చేసుకున్న పవన్ ఇప్పుడు రాజకీయాల కారణంగా మధ్యలో కొంత గ్యాప్ తీసుకొనున్నాడు.

క్రిష్ ఆ సినిమాకు విరూపాక్షి అనే టైటిల్ ని సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. వాకీల్ సాబ్ తో పాటు వీరూపాక్షి కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరీంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి పూర్తయితే పవన్ హరీష్ శంకర్ సినిమాను కూడా సెట్స్ పైకి తేవాలని అనుకున్నాడు. ప్రస్తుతం దర్శకుడు హరీష్ స్క్రిప్ట్ పనులను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.