అనుష్క శెట్టి లేడి ఓరియెంటెడ్ ఫిల్మ్ నిశ్శబ్దం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో గాని సినిమాకు సంబందించిన న్యూస్ మాత్రం ఆడియెన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. మాధవన్ ఈ  సినిమాలో ఒక మ్యూజిషియన్ గా కనిపించబోతున్నాడు.

ఇక తెలుగమ్మాయి అంజలి కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్  పోస్టర్ ని రిలీజ్ చేసింది. యూఎస్ కి చెందిన క్రైమ్ డిటెక్టివ్ ఆఫీసర్ మాహా అనే పాత్రలో విభిన్న స్వభావంతో అంజలి పాత్ర అలరిస్తుందట. ఆమె స్పెషల్ గా అనుష్క క్యారెక్టర్ ని టార్గెట్ చేసే సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.

గతంలో ఎప్పుడు లేని విధంగా అంజలి తన నటనతో సరికొత్త కిక్ ఇవ్వనుందట, కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ టీజర్ ని నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. నిశ్శబ్దం సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషల్లో సినిమాను ఒకేసారి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. ఇక అంజలితో పాటు హాలీవుడ్ యాక్టర్ మైకేల్ కూడా  సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అతనికి భారీ పారితోషికం ఇచ్చి సినిమాలో విలన్ పాత్రకు ఒప్పించినట్లు తెలుస్తోంది.