సారాంశం

 అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి (Bhagavanth Kesari) మంచి సక్సెస్ అయ్యింది.

అనిల్ రావిపూడి అంటే తెలుగులో ఎంటర్టైన్మెంట్స్ కు  ఓ బ్రాండ్.  ‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుని ..ఆ తర్వాత `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా నిలబడ్డారు. ఇక ‘ఎఫ్-2’ బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో తెలుగులో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్స్ లిస్ట్‌లో చేరారు. ఆ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు హీరోగా దిల్‌రాజు  నిర్మించిన అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’కూడా సూపర్ హిట్ అయ్యింది.

  రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా..దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి (Bhagavanth Kesari). శ్రీలీల, కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్స్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి..పెద్ద సక్సెస్ అయింది.  ఈ నేఫద్యంలో ఈ చిత్రం తర్వాత అనీల్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు ..అనీల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని రవితేజతో చేయబోతున్నారు. రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావుతో పలకరించిన రవితేజ ఇప్పుడు తనకు హిట్ ఇచ్చిన దర్శకులతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే గోపిచంద్ మలినేని తో సినిమా మొదలెట్టారు. ఆ తర్వాత హరీష్ శంకర్, అనీల్ రావిపూడి అని వినిపించింది. అనీల్ రావిపూడి ఇప్పటికే రవితేజను కలిసి కథ వినిపించారని సమాచారం.  ఆ స్టోరీ లైన్ నచ్చి గో ఏ హెడ్ అని రవితేజ అనటంతో స్క్రిప్టు పై కూర్చుని జనవరికి ఫినిష్ చేసి పూర్తి స్క్రిప్టుని వినిపించబోతున్నారట.

అనిల్ రావిపూడి కు రెగ్యులర్ ప్రొడ్యూసర్ గా ఉంటూ వచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టుని నిర్మిస్తారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ నిమిత్తం  రవితేజ, అనిల్ రావిపూడి ఇద్దరూ భారీగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ గ్యాప్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి అనిల్ రావిపూడి ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే, ఆయన వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఓ కొలిక్కి వచ్చాకే మరో ప్రాజెక్టు సైన్ చేస్తారని వినికిడి. ఈ లోపల రవితేజతో సినిమా పూర్తిచేయడానికి అనిల్ రెడీ అవుతున్నారట.

అంతేకాకుండా..బాలయ్య ఏ క్షణంలో పిలిచిన..ఆయనతో మరో సినిమా చేయడానికి ఎప్పుడైనా రెడీ అంటూ ప్రకటించాడు అనిల్.  దీంతో ఈ పవర్ఫుల్ కాంబోలో మరో సినిమా వచ్చే అవకాశం ఉంది.