లాక్ డౌన్ దెబ్బకు..ఎవరు ఎక్కడున్నారో అని ఎంక్వైరీలు బయిలు దేరాయి. ఎందుకంటే ఇళ్లలో ఉండేది కొందరైతే...పనులు మీద వేరే చోటకు వెళ్లి అక్కడ ఇరుక్కోపోయేవాళ్లు కొందరు. ఈ నేపధ్యంలో రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనీల్ రావిపూడి ఎక్కడ ఉన్నారు..ఏం చేస్తున్నారు అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే హాట్ డైరక్టర్స్ ఏం చేస్తున్నారు..ఎక్కడ ఉన్నారు..ఏ హీరోతో నెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారనేది జనాలకు ఆసక్తి. ఇదే విషయం మీద వర్కవుట్ చేసి  ఓ మీడియా హౌస్ ...అనీల్ రావిపూడి ఎక్కడ ఉన్నారో..ఏం చేస్తున్నారో చెప్పుకొచ్చింది.

అనీల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ.." ఎఫ్ 3 స్క్రిప్టుతో నా టీమ్ తో కలిసి స్టోరీ డిస్కషన్స్ లో ఉన్నాను. ప్రకాశం జిల్లాలోని నా సొంత ఊళ్లో ఉన్నా. లాక్ డౌన్ కు ముందే ఇక్కడకు షిప్ట్ అయ్యిపోయాను. అంతేకాదు హైదరాబాద్ నుంచి వంటవాళ్లను కూడా తెచ్చుకున్నాము. మా బిల్డంగ్ రెండు అంతస్దులు. ఇక్కడ శుభ్రంగా నచ్చింది తినటం, డిస్కస్ చేసుకోవటం, రాసుకోవటం చేస్తున్నాము. అసలు బయిట ప్రపంచం అనేదే లేదు మాకు" అని చెప్పుకొచ్చారు. 

ఇక తన తాజా చిత్రం గురించి చెప్తూ.. "F3 ఓ ఫ్రాంఛైజి. లీడ్ పెయిల్ ల మ్యానరిజంలు అన్ని అలాగే ఉంటాయి. వెంకీ ఆశనం, హనీ ఈజ్ ది బెస్ట్ , అంతెగా అంతేగా కంటిన్యూ అవుతాయి. అయితే కామెడీ డోస్ పెంచుతాము. జంధ్యాల గారి పాత సినిమాలు చూస్తున్నాం రోజూ. మా స్క్రిప్టు వర్క్ కు మంచి మూడ్ , ప్రేరణ ఆ సినిమాలు ఇస్తున్నాయి " అని చెప్పుకొచ్చారు.

ఇక మహేష్ బాబు ఎఫ్ 3లో నటించటం గురించి చెప్తూ..అది కేవలం ఓ గాసిప్ మాత్రమే. కానీ నేను ఆయనతో పనిచేయటానికి ఇష్టపడతాను. మళ్లీ ఆయనతో పనిచేసే సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ప్రస్తుతం నా ఫోకస్ అంతా ఎఫ్ 3 పైనే అన్నారు.