Asianet News TeluguAsianet News Telugu

అనీల్ రావిపూడి నెక్ట్స్ ఖరారు.. హీరో ఎవరంటే..?

ఆ హీరో మరెవరో కాదు అక్కినేని అఖిల్. అసలు సరిలేరు నీకెవ్వరు తర్వాత రామ్ చరణ్ తో సినిమా అనుకున్నారంతా. అయితే రామ్ చరణ్ తాను బిజి షెడ్యూల్ లో ఉన్నాను ..టైమ్ పడుతుంది..ఖాళీగా ఉండటం ఎందుకు వెయిట్ చేస్తూ అని చెప్పి తప్పుకున్నారట. 

Anil Ravipudi next with Akhil Akkineni?
Author
Hyderabad, First Published Feb 8, 2020, 10:44 AM IST

శ్రీను వైట్ల తర్వాత కామెడీ ని నమ్ముకుని పైకి వచ్చిన డైరక్టర్ అనీల్ రావిపూడి. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోని సూపర్  స్టార్ ను డైరెక్ట్ చేసి,  టాప్ డైరక్టర్స్ లిస్ట్ లో కలిసాడు.కంటెంట్ కన్నా కథనం మీద అందులో కమర్సియల్ ఎలిమెంట్స్ పై అతను పెట్టే దృష్టే అనీల్ ని ఈ స్దాయికి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఎఫ్ 2 చిత్రం విజయం అందరి దృష్టి తనపై పడేలా చేసింది. ఈ తర్వాత ఈ సంక్రాంతికి విడుదల చేసిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం మరింతగా అతని స్టార్డమ్ ని లేపింది.

దాంతో ఈ దర్శకుడు తదుపరి చిత్రం ఏ హీరోతో చెయ్యబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.  మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సక్సెస్ నుంచి బయిటకు వచ్చి.. వంశీ పైడిపల్లితో సినిమా ప్రారంభించటానికి సిద్దంగా ఉన్నారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం హీరోలు చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. అయితే తాజాగా అనీల్ రావిపూడి కథను ఓ హీరో ఓకే చేసినట్లు సమాచారం.

మహేష్, బన్నీ, చరణ్.. ఈ హీరోలతో మా వల్ల కాదన్న దర్శకులు!

ఆ హీరో మరెవరో కాదు అక్కినేని అఖిల్. అసలు సరిలేరు నీకెవ్వరు తర్వాత రామ్ చరణ్ తో సినిమా అనుకున్నారంతా. అయితే రామ్ చరణ్ తాను బిజి షెడ్యూల్ లో ఉన్నాను ..టైమ్ పడుతుంది..ఖాళీగా ఉండటం ఎందుకు వెయిట్ చేస్తూ అని చెప్పి తప్పుకున్నారట. ఈ నేపధ్యంలో తన దగ్గర ఉన్న ఓ లవ్ స్టోరీతో కలిసిన యాక్షన్ ఎంటర్టైనర్ కు అఖిల్ అయితే సరిపోతారని భావించి కథ చెప్పటం జరిగింది.

అఖిల్ కు కూడా బాగా నచ్చినట్లు చెప్తున్నారు. అనీల్ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు కావటంతో తన కెరీర్ కు సైతం ప్లస్ అవుతుందని భావిస్తున్నాడట. అంతేకాకుండా కామెడీ సినిమా కాబట్టి మినిమం గ్యారెంటీ ఉంటుందని నమ్ముతున్నారట. ఈ ప్రాజెక్టు పూర్తి స్క్రిప్టు వినిపించి లాక్ చేయబోతున్నట్లు సమాచారం.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సంవత్సరం ఆగస్టు నుంచి పట్టాలు ఎక్కనుంది. ఈ లోగా అఖిల్ ...తను చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం ఫినిష్ చేసుకుని వస్తాడు. ఇక అనిల్ కూడా కొందరు హీరోలకు సరిపోయే కథలతో సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు మన స్టార్ హీరోలను మెప్పించాలంటే బౌండ్ స్క్రిప్ట్ తో పాటు మంచి కంటెంట్ కూడా ఇంపార్టెంట్.

ఆ విషయంలో అనిల్ ముందు నుంచీ కాస్త వీక్ గానే ఉన్నాడని చెప్పాలి. ఆ వీక్ నెస్ సరిలేరు నీకెవ్వరులోనూ బయిటపడింది. నిర్మాతల విషయానికి వస్తే.... సరిలేరు నీకెవ్వరు పెద్ద విజయం సాధించటంతో అతనికోసం పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా అడ్వాన్స్ లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios