పెద్ద సినిమాలు ఒకే సమయంలో రిలీజైతే అభిమానుల మధ్య యుద్ధం ఆ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గాక చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద హీరో రికార్డులే ఈ కొట్లాటకు బూస్ట్ ఇస్తాయి. ప్రస్తుతం సినిమాలకు సంబందించిన కలెక్షన్స్ విషయంలో ఎవరికి నమ్మకం కలగడం లేదు. ఇక రీసెంట్ గా విడుదలైన సరిలేరు నీకెవ్వరు - అల.. వైకుంఠపురములో సినిమా కలెక్షన్స్ పై కూడా అనేక రకాల అనుమానాలు వెలువడ్డాయి.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా అల్లు అర్జున్ టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ దర్శకులను పిలిచి పార్టీ ఇచ్చాడు. అయితే వారిలో అనిల్ రావిపూడి కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. సినిమా విడుదలకు ముందు ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్న చిత్ర యూనిట్ సభ్యులు రిలీజ్ తరువాత కలెక్షన్స్ అప్డేట్స్ తో కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. సంక్రాంతి మొగుడు.. బాక్స్ ఆఫీస్ అసలు మొగుడు.. అంటూ కలెక్షన్స్ అప్డేట్స్ తో వివాదాలకు మరీంత బలాన్ని ఇచ్చారు.

ప్రమోషన్స్ కి అది ఉపయోగపడినప్పటికీ పర్సనల్ గా కూడా చిత్ర వర్గాల్లో విబేధాలు ఏమైనా తలెత్తాయా? అనే టాక్ వస్తోంది. పైగా అనిల్ రావిపూడిని బన్నీ ఇన్వైట్ చేయలేదనే రూమర్ కూడా వస్తోంది. ఇది ఎంతవరకు నిజమనేది ఇప్పట్లో తేలేలా లేదు. కానీ అల.. సరిలేరు నీకెవ్వరు రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయిన్నప్పటికీ కలెక్షన్స్ విషయంలో సినిమా వర్గాల్లో విబేధాలు వచ్చాయనేది నిజమని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిస్తున్న సమాచారం.