Asianet News TeluguAsianet News Telugu

Anil Ravipudi :గమనించారా?!: అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో విచిత్రం

 ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసి చిత్రబృందానికి అభింనదనలు తెలిపారు. దర్శకుడు సందీప్‌ రాజ్‌ ఈ సినిమాకు కథ స్క్రీన్‌ ప్లే, మాటలు అందిస్తున్నారు.

Anil Ravipudi launches first look of Mukha Chitram
Author
Hyderabad, First Published Jan 11, 2022, 9:32 AM IST

ఇప్పుడు వస్తున్న దర్శకులు ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఏదో విధంగా తమ చిత్రంపై బజ్ క్రియేట్ చేయకపోతే జనం పట్టించుకోరని వాళ్లకు తెలుసు. తాజాగా టాలీవుడ్ లో రిలీజైన ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ...ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫస్ట్ లుక్ ని కొద్ది సేపు గమనిస్తే అదేంటో అర్దమవుతుంది. వివరాల్లోకి వెళితే..

చైతన్య రావ్‌, అయేషా ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'ముఖచిత్రం'.  ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసి చిత్రబృందానికి అభింనదనలు తెలిపారు. దర్శకుడు సందీప్‌ రాజ్‌ ఈ సినిమాకు కథ స్క్రీన్‌ ప్లే, మాటలు అందిస్తున్నారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఎస్‌కెఎన్‌ సమర్పణలో పాకెట్‌ మనీ పిక్చర్స్‌ పతాకంపై ప్రదీప్‌ యాదవ్‌, మోహన్‌ యల్ల 'ముఖచిత్రం' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.  ఈ ఫస్ట్ లుక్ ని మీరూ చూడండి.

 

 ఫన్ అండ్ ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఫస్ట్ లుక్ లో వికాస్ వశిష్ట, చైతన్య రావ్, అయేషా ఖాన్ నిలబడి ఉండగా… ప్రియ వడ్లమాని రెండు పాత్రల్లో కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఒక పాత్రలో ఆధునిక యువతిగా కనిపిస్తుండగా, మరో పాత్రలో పూర్తి సంప్రదాయంగా చీరకట్టులో ఉంది. ఈ రెండు పాత్రల్లోని వేరియేషన్ సినిమా కథలో కీలకంగా ఉంటుందని అనుకోవచ్చు.  మొదట చూసినప్పుడు రెగ్యులర్ పోస్టర్ లాగ అనిపించే ఈ ఫస్ట్ లుక్..కాస్త పరిశీలించి చూస్తే ఈ విచిత్రం కనపడుతుంది. ‘కలర్ ఫొటో’ సినిమా తర్వాత దర్శకుడు సందీప్ రాజ్ మరో క్రియేటివ్ స్టోరీని రాసినట్లు తెలుస్తోంది. ఈ కథ బాగా నచ్చినందువల్ల నిర్మాత ఎస్.కె.ఎన్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించారని టాక్!

నటీనటులు - వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ సాంకేతిక నిపుణులు - సంగీతం - కాల భైరవ, ఎడిటింగ్ - పవన్ కళ్యాణ్, సమర్పణ - ఎస్ కేఎన్, నిర్మాతలు - ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల, కథ స్క్రీన్ ప్లే మాటలు - సందీప్ రాజ్, దర్శకత్వం - గంగాధర్
Also Read: Ram Charan : క్రేజీ డైరెక్టర్ తో రామ్ చరణ్.. మెగా హీరో స్పీడ్ మామూలుగా లేదుగా

Follow Us:
Download App:
  • android
  • ios