గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన  కామెడీ ఎంటర్టైనర్ F2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అప్పటివరకు అపజయాలతో సతమతమైన హీరోలకు ఆ సినిమా మంచి బూస్ట్ ఇవ్వడమే కాకుండా నిర్మాత దిల్ రాజుకి 80కోట్లవరకు లాభాలని అందించింది. అయితే సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతున్నట్లు ఇటీవల వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

చిత్ర యూనిట్ కూడా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది.  అయితే మరోసారి F3 ప్రాజెక్ట్ పై అందరి ద్రుష్టి పడేలా ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒక స్టోరీ లైన్ ఫిక్స్ అయ్యిందని అయితే దాన్ని డెవలప్ చేయడానికి కాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. సినిమాలో మరో హీరోగా మాస్ రాజా రవితేజను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

అయితే రవితేజపై దర్శకుడు అనిల్ రావిపూడి ఇంట్రెస్ట్ చూపినంతగా నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. ఎందుకంటె ఇటీవల కాలంలో మాస్ రాజా మార్కెట్ చాలా వరకు తగ్గిపోయింది. దీంతో F3 బిజినెస్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని దిల్ రాజు రవితేజను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. చేసేదేమి లేక అనిల్ కూడా దిల్ రాజు నిర్ణయానికి సైలెంట్ అయినట్లు టాక్ వస్తోంది.

అయితే రవితేజ చేయాల్సిన ఆ పాత్రను ఎవరిని వరిస్తుందో చూడాలి.  గతంలోనే ఈ టాక్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఇంకా ఆ రూమర్ డోస్ పెరిగింది. ఇకపోతే హీరో వెంకటేష్ గతంలో ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో F2 సీక్వెల్ పై చర్చలు జరుగుతున్నట్లు చెబుతూ.. వరుణ్ తేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి లతో అప్పుడపుడు కలుసుకొని సినిమాపై డిస్కస్ చేస్తున్నట్లు వెంకటేష్ తెలియజేశారు.