వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా రూపొందిన సూపర్‌ హిట్ సినిమా ఎఫ్ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) . దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్‌ అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కనుందన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. ఎఫ్‌ 2 ఎండింగ్‌ లోనూ ఎఫ్ 3 ఉంటుందన్న హింట్ ఇవ్వటంతో అభిమానులు సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎఫ్ 2 తరువాత ఏకంగా సూపర్‌ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేసే ఛాన్స్‌ కొట్టేసిన అనిల్ రావిపూడి, సరిలేరు నీకెవ్వరు సినిమాలో మరో బ్లాక్‌ బస్టర్‌ ను తన ఖాతాలో వేసుకున్నాడు.  అదే జోరులో ఎఫ్ 3కి రంగం సిద్ధం చేశాడు అనిల్. చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఎఫ్ 3లో వెంకీ, వరుణ్‌ లు మరోసారి కలిసి నటించబోతున్నారని, మూడో హీరోగా రవితేజ నటించనున్నాడన్న వార్తలు కూడా వినిపించాయి.

అయితే నటీనటుల విషయంలో ఇంకా క్లారిటీ రాకపోయినా త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సినిమాను ఆగస్టులో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని డెడ్‌ లైన్‌ విధించాడట దిల్ రాజ్‌. దీంతో అందుకు తగ్గట్టుగా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచాడట అనిల్‌. ఎఫ్ 2 ను మించి కామెడీ పండించేలా ఈ సినిమా తీర్చిదిద్దే ప్లాన్‌ లో ఉన్నాడు. అనుకున్నట్టుగా ఆగస్టులో సినిమా సెట్స్ మీదకు వెళితే 2021 సంక్రాంతి మరోసారి ఎఫ్ 3 సక్సెస్ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.