టాలీవుడ్ టాప్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన అనిల్ రావిపూడి క్రేజ్ ఎలా ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వారుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ అందుకున్న ఈ కమర్షియల్ డైరెక్టర్ కోసం స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సరిలేరు నికేవ్వరు సినిమాతో మహేష్ లాంటి స్టార్ హీరోని కూడా అద్భుతంగా ప్రజెంట్ చేశాడని ప్రశంసలు అందుకున్నాడు. ఆ మధ్య అనిల్ బాలక్రిష్ణ తో ఒక సినిమా చేయనున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ మరొకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈటీవీ లో ఇటీవల తరుణ్ భాస్కర్ 'నీకు మాత్రమే చెప్తా' అనే షోని స్టార్ట్ చేశారు. అందులో అనిల్ తన వ్యక్తిగత జీవితం గురించి అలాగే డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు. బాలకృష్ణ తో ఒక సినిమా చేయాలని ఉందని కుదిరితే మోక్షజ్ఞ తో కూడా మంచి సినిమా చేయాలని ఉందని అనిల్ తెలిపాడు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ - చిరంజీవిని కూడా డైరెక్ట్ చేసే లిస్ట్ లో రాసుకున్నట్లు దర్శకుడు వివరణ ఇచ్చాడు.ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఒక రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే కొడుకు మొదటి సినిమాను నిర్మించాలని అనుకున్న బాలక్రిష్ణ ఆ తరువాత మనసు మార్చుకున్నాడు.

ఇక ఇప్పుడు సక్సెస్ ట్రాక్ పై దూసుకుపోతున్న అనిల్ రావిపూడి నందమూరి వరసుడిని డైరెక్ట్ చేయలనుందని చెప్పారు కాబట్టి బాలయ్య ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదో చూడాలి. అసలైతే బాలక్రిష్ణతో అనిల్ పటాస్ సినిమా అనంతరం ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. రామారావు గారు అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయింది. మరి బాలకృష్ణ నెక్స్ట్ అనిల్ రవిపూడితో ఎలాంటి దీలింగ్ సెట్ చేసుకుంటాడా చూడాలి.