జబర్దస్త్ యాంకర్..జబర్దస్త్ గా సినిమాల్లో దూసుకుపోతోంది. ఆమె పెద్ద తెరపై తన విశ్వరూపం చూపిస్తోంది. ముఖ్యంగా రంగస్దలంలో రంగమ్మత్త పాత్ర చేసిన నాటి నుంచీ ఆమెకు వరస ఆఫర్స్ వస్తున్నాయి. నటనకు అవకాసం ఉన్న ఆ పాత్రల్లో ఆమె తనేంటో చూపించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ రూపొందే చిత్రం కమిటైన ఆమె, పింక్ రీమేక్ లో కూడా చేయబోతోందని అంటున్నారు. ఇదిలా ఉంటే ...ఆమెను టబు లో హిందీలో చేసిన ఓ పాత్రని  తెలుగులో చేయమని అడుగుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ పాత్ర ఏమిటీ అంటే... బాలీవుడ్‌ చిత్రం ‘అంధాధున్‌’ లో కీలకమైనది.

మూడు కేటగిరీల్లో జాతీయ పురస్కారం అందుకున్న బాలీవుడ్‌ చిత్రం ‘అంధాధున్‌’.  ఆయుష్మాన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో చేయాలని హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రైట్స్ తీసుకున్నారు. అందులో టబు పాత్ర కీలకం. ఆ పాత్ర చుట్టూనే సినిమా జరుగుతుంది. ఆ పాత్రను అంత సమర్దవంతంగా నటించటమే కాకుండా కాస్త గ్లామర్ ఉన్నవాళ్లు కావాలి. అందుకోసం అనుసూయను సంప్రదించినట్లు సమాచారం. ముఖ్యంగా అనసూయ ఉంటే బి,సి సెంటర్లలలో సినిమా నడుస్తుందనే నమ్మకంతో ఆమెను తీసుకోదలుస్తున్నట్లు చెప్తున్నారు.

ఇక ఈ చిత్రం హీరో చూడగలిగి కూడా గుడ్డివాడుగా నటించాలి!  ఆ పాత్రను నితిన్ వేయబోతున్నారు. రీసెంట్ గా భీష్మతో హిట్ కొట్టిన నితిన్ ఈ పాత్రను చేయటానికి ఉత్సాహం గా ఉన్నారు. శ్రేష్ఠ్‌ మీడియా, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించబోతున్నాయట. ఈ  చిత్రానికి దర్శకత్వం వహించేది  మేర్లపాక గాంధీ. ప్రస్తుతం  స్క్రిప్టు వర్క్ సాగుతున్నాయని టాలీవుడ్‌ టాక్‌. త్వరలోనే వివరాలు తెలియనున్నాయి.

శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వంలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలలో హిందీలో రూపొందిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ “అంధాధున్”. ఈ  మూవీ 2018 సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. 32 కోట్లతో రూపొందిన ఈ మూవీ 456 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. 3 నేషనల్ అవార్డ్స్, 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది.