బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు సభ్యులు ఫైనల్ రేసు కోసం పోటీ పడుతున్నారు. శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్, రాహుల్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రేక్షకులు తమ అభిమాన కంటెస్టెంట్ కోసం బాగానే హడావిడి చేస్తున్నారు. 

శ్రీముఖి టీం బయట ప్రమోషన్స్ తో మోతెక్కిస్తున్నారు. రాహుల్ తప్ప మిగిలిన వారంతా ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్నారు. ఫైనల్ కు చేరాలంటే శ్రీముఖి, వరుణ్, అలీ రెజా, బాబా, శివజ్యోతి ఈవారం నామినేషన్ గండం నుంచి గట్టెక్కాల్సి ఉంటుంది. దీనితో వీరంతా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో సర్వశక్తులు ఉపయోగించి కష్టపడుతున్నారు. 

శ్రీముఖికి సోషల్ మీడియాలో రోజు రోజుకు క్రేజ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె నిత్యం ఎనర్జిటిక్ గా ఉంటూ హౌస్ లో సందడి చేస్తోంది. సెలెబ్రిటీలు క్రమంగా శ్రీముఖికి మద్దతు తెలుపుతున్నారు. హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ శ్రీముఖికి మద్దతు తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. 

నా ఓట్, సపోర్ట్ రెండూ శ్రీముఖికే. ఎందుకంటే శ్రీముఖి నాకు వ్యక్తిగతంగా తెలుసు. చాలా కష్టపడి ఎదిగిన అమ్మాయి. ఆమె బిగ్ బాస్ టైటిల్ సాధించాలి అని రష్మీ వీడియోలో పేర్కొంది. 

జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ కూడా శ్రీముఖికి మద్దతు తెలిపాడు. శ్రీముఖి నా స్నేహితురాలు. ఆమె ఫైనల్ చేరుకొని విజేతగా నిలవాలని కోరుకుంటున్నా. మీరు కూడా శ్రీముఖికి ఓట్ వేయండి అని రాంప్రసాద్ అభిమానులని కోరాడు.