ఒకప్పుడు యాంకర్ గా బిజీగా కనిపించిన ఉదయభాను ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ తోనే బిజీబిజీగా మారింది. చాలా వరకు ఆమె బుల్లితెరకు దూరంగానే ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన శంషాబాద్ హత్యాచార ఘటన అనంతరం ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఇంటర్వ్యూలో ఘటనపై ఆమె కన్నీటితో తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఉదయభాను మాట్లాడుతూ.. "అనుక్షణం కొన్ని లక్షల మంది అనుభవిస్తున్న నరకం ఇది. ఒక ఆడపిల్లగా జీవితాన్ని కొనసాగించాలంటే ప్రతిరోజు కొన్ని వందల చావులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎలా చంపి ఉంటారో తలచుకుంటేనే.. భయం వేస్తోంది. అప్పుడే పుట్టిన పసి పిల్లల్ని కూడా వదలడం లేదు. పెను ముసలి వాళ్లపై కూడా అత్యచారాలు జరుగుతున్నాయి. కుక్కల్లా మీద పడుతున్నారు.

అలాంటి వాళ్ళని నడి రోడ్డున షూట్ చేసి పారేయాలి.  దేశంలో బ్రతకాలంటేనే భయం వేస్తోంది. నాకు కొన్నిసార్లు షూటింగ్ కి వెళ్లి అర్ధరాత్రి అయినప్పుడు ఇంటికి వెళ్ళాలి అంటే భయం వేస్తోంది. నాకు ఇద్దరు ఆడ పిల్లలు. వాళ్ళని ఎలా పెంచాలి. ఎలాంటి దేశంలో బ్రతుకుతున్నాం మనం. కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ కూడా తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. అలాంటి వాళ్ళని కూడా శిక్షించాలి. నిర్భయ లాంటి ఘటన జరిగినప్పుడు మరో ఘటన జరగకూడదని చెప్పారు.

కానీ ఘటనలు ఏ మాత్రం తగ్గలేదు.  హత్యచారా ఘటనల్లో ఎంత మంది నిందితులకు శిక్ష పడింది. దున్నపోతుల్లా రేపిస్టులను పెంచుతున్నారు. దేశంలో చీడపురుగులు ఎక్కువయ్యాయి. 90% ఇలానే మారిపోయారు. ఘటన జరిగిన అనంతరం ఒక ఆడపిల్లగా నా వెన్నులో వణుకు పుడుతోంది. భయం ఉన్నపుడే దుర్మార్గులను ఉరి తీయాలి. వదలకుండా ప్రతి ఒక్కరిని షూట్ చేసి పారేయాలి.

టివి చూస్తు నా కూతురు అడుగుతోంది. ఏమైంది అని. వారికి ఏం సమాధానం చెప్పాలి. మనకి ఎక్కడా కూడా రక్షణ లేదు.  అందరం కలిసి కట్టుగా నిలబడాలి. ముందు రాజకీయ నాయకుల పాలన మారలి. నాకే గనక ఏదైనా పోస్ట్ ఉంటే వాళ్ళని కాల్చి చంపేస్తా.. మన పిల్లలకి ఏం నేర్పించాలి. పోలీసుల వైఖరి కూడా కరెక్ట్ గా లేదు"  అని కన్నీటితో ఉదయభాను తన ఆవేదనను వ్యక్తం చేశారు.