నటిగా కెరీర్ మొదలుపెట్టిన సుమ.. ఆ తరువాత యాంకర్ గా టర్న్ తీసుకుంది. వరుసగా షోలు చేస్తూ బిజీగా గడుపుతోంది. పెళ్లి, పిల్లలు తన కెరీర్ కి ఎంతమాత్రం అడ్డుకాదని టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది. బుల్లితెరపై ఆమె ఎంత పాపులర్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

పలు టీవీ ఛానెల్స్ ఆమెతో రియాలిటీ షోలు చేస్తున్నాయి. షోకి యాంకర్  గా సుమ ఉందంటే అది హిట్టే అనే నమ్మకం దర్శకనిర్మాతల్లో కలిగింది. అంతగా తన యాంకరింగ్ తో మెప్పిస్తోంది. టీవీషోలు, ఆడియో ఫంక్షన్స్ అంటూ బిజీగా గడిపే సుమ ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తమ అభిమానుల కోసం వెరైటీ వీడియోలు చేస్తుంది. 'సుమక్క' అనే పేరుతో ఛానెల్ మొదలుపెట్టింది.

ఈ ఛానెల్ ని ఇప్పటివరకు రెండున్నర లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే సుమ స్వయంగా సాంబార్ ప్రిపేర్ చేస్తుంది. సుమ ఆరోగ్య రహస్యం సాంబారేనట. ఈ సందర్భంగా ఆమె రుచికరమైన సమబారు ఎలా తయారు చేయాలో చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేసింది.

తనే స్వయంగా మార్కెట్ కి వెళ్లి మరీ సాంబారుకి కావాల్సిన కూరగాయలు కొనుగోలు చేసింది. ఆ తరువాత ఇంటికి వెళ్లి కిచెన్ రూమ్ లో తన ఫేవరేట్ సాంబార్ రెసిపీ ఫాలో అవుతూ వంటకం సిద్ధం చేసింది. ఈ వీడియోలో చూసి మీరు కూడా కేరళ సాంబార్ సిద్ధం చేసుకోవచ్చు.