ఎందరు యంగ్ యాంకర్లు వచ్చినా సీనియర్ యాంకర్ సుమకు ఉండే క్రేజే వేరు. బుల్లితెరపై, ప్రీరిలీజ్ ఈవెంట్స్...ఎక్కడ చూసినా ఆమే. ఆమె స్టేజిపై ఉందంటే ఆ కళే వేరంటారు నిర్వాహకులు. సినిమా పంక్షన్స్ కు ఖచ్చితంగా ఆమె ఉండాల్సిందే అని హీరోలు పట్టుబడుతూంటారు. కేరళ నుంచి వచ్చినా,మాతృభాష మళయాళం అయినా ఆమె తెలుగు మనందరికన్నా స్పష్టంగా మాట్లాడగలదని చాలా మంది ఒప్పుకుంటారు. అయితే గత కొద్ది కాలంగా ఆమెను ప్రక్కన పెట్టి మంజూష ఎక్కువగా ప్రీ రిలీజ్, ఆడియో పంక్షన్ లో ఎక్కువగా కనపడుతోంది. కారణమేమిటి అనేది చాలా మందిని ఆలోచనలో పడేసే అంశం.
 
ఫిల్మ్ సర్కిల్స్  నుంచి అందుతున్న సమాచారం మేరకు సుమ కనకాల రెమ్యునేషన్ పెంచటమే అందుకు కారణం అంటున్నారు. ఆమె రెండు గంటల ఈవెంట్ కు మూడు నుంచి ఐదు లక్షలు దాకా తీసుకుంటుంది. అయితే అది ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ సినిమాల పంక్షన్స్ కు అయితే ఏ సమస్యా లేదు. కానీ చిన్న సినిమాలకు కూడా ఆమె అదే స్దాయిలో డిమాండ్ చేస్తోందని, దాంతో ఆమెను తమ పంక్షన్ లో యాంకరింగ్ కు పిలుద్దామన్నా పిలవలేకపోతున్నామని వాపోతున్నారు. అయితే సుమ స్ట్రాటజీ వేరే అంటున్నారు.

మరీ చిన్న సినిమాలకు స్టేజిపై కనపడితే పెద్ద సినిమాలకు తను ఎక్సక్లూజివ్ అనేది పోతుందని భావిస్తోందని అందుకే తన డిమాండ్ అలాగే ఉంచుకోవటానికి ఇలా రేటు తగ్గించకుండా అడుగుతోందని, అప్పటికే అందుకు ఒప్పుకుంటే అంతలా తనే కావాలనుకునేవాళ్ల ఈవెంట్స్ కే వెళ్తోందట. సుమతో పోలిస్తే ..మంజూష చాలా తక్కువ తీసుకుంటుది కాబట్టి ఆమెనే ప్రిఫర్ చేస్తున్నారట.అందుకే ఎక్కువగా ఆమె ఈవెంట్స్ లో కనపడటం లేదని తెలుస్తోంది.

2019లో 100కోట్ల సినిమాలు.. నెగిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలైంది!
 
ప్రస్తుతం సుమ సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి లక్కు కిక్కు అనే పోగ్రామ్ ప్రారంభించింది. పోగ్రామ్ లతో ఎక్కువ బిజిగా ఉంటోంది సుమ.  మరో ప్రక్క సుమకు పోటీగా ఝాన్సీ, అనసూయ, శ్రీముఖి, రేష్మి, ప్రదీప్ వంటివారు దూసుకుపోతున్నారు. ఎవరి స్పీడు వారిది..ఎవరి ఆదాయం వారిది. ఎందరొచ్చినా సుమ నవ్వుని, ఆమె స్పాంటినిటీని, ఆమెలో హ్యూమర్ ఏంగిల్ ని కొట్టేవారు ఉండరు. అలాగే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ తక్కువ కాదు. కాబట్టి ఆమె మరో పదేళ్లు అయినా ఇదే స్పీడులో ఉంటుందనటంలో సందేహం లేదు.