బిగ్ బాస్ సీజన్ 3 పూర్తయిన తరువాత కంటెస్టంట్స్ ఒక్కొక్కరూ మీడియాలో ఇంటర్వ్యూలో ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో నలుగురు స్నేహితులైన రాహుల్, పునర్నవి, వితికా, వరుణ్ లను యాంకర్ రవి ఇంటర్వ్యూ చేశాడు. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టిన రవి ఇంటర్వ్యూలు స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టంట్స్ ని ఇంటర్వ్యూ చేశాడు. దీనికోసం ముందుగా బిగ్ బాస్ అవతారమెత్తిన రవి ఎవరికీ కనిపించకుండా తన వాయిస్ వినిపిస్తూ మాట్లాడాడు. బిగ్ బాస్ టాస్క్ లలో మాదిరి ఫోన్ బూత్ ఏర్పాటు చేసి ఒక్కో కంటెస్టంట్ ని ఫోన్ లిఫ్ట్ చేయమని చెబుతూ వారితో ఫోన్లో మాట్లాడాడు రవి.

ఈ క్రమంలో వరుణ్ సందేశ్ ని కాస్త వల్గర్ ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టాడు. 'బిగ్ బాస్ హౌస్ లో బెడ్ రూమ్ లో ఎన్నిసార్లు కంట్రోల్, కంట్రోల్ అని అనుకున్నావని' వరుణ్ ని అడిగాడు రవి. దీనికి వరుణ్.. 'మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదని' అన్నాడు. అయినప్పటికీ రవి విడిచిపెట్టకుండా.. 'మీకు అర్ధమైంది నాకు తెలుసు' అంటూ వరుణ్ ని మరోసారి అదే ప్రశ్న అడిగాడు.

అప్పటికీ వరుణ్.. 'మనది ఫ్యామిలీ షో కదా' అంటూ ఏదో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నా.. రవి మాత్రం పదే పదే అదే ప్రశ్న అడగడంతో ఇక ఏం చేయలేక.. తనకు అలా ఎప్పుడూ అనిపించలేదని.. టాస్క్ ఆడడానికి హౌస్ లోపాలకి వెళ్లామని.. హనీమూన్ కి కాదంటూ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పాడు. ఆ తరువాత పునర్నవి, రాహుల్ ని కూడా తన పిచ్చి ప్రశ్నలతో టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ వారిద్దరూ తెలివిగా తమ సమాధానాలతో తప్పించుకున్నారు.