మల్లెమాల ప్రొడక్షన్ నుంచి వచ్చిన బెస్ట్ టివి షోల్లో పటాస్ ఒకటి. డీ - జబర్దస్త్ ఇలా ప్రతి షో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఈటివి ప్లస్ ఛానెల్ క్లిక్ అవ్వడానికి ప్రధాన కారణం పటాస్ షో. ఆ ఛానెల్ ఒకటి ఉందని ఆ షోతోనే జనాలకు తెలిసింది. అయితే ఈ మధ్య కాలంలో షోకి సంబందించిన వివాదాలు ఎక్కువవుతున్నాయి.

 ప్రొడక్షన్ అధికారులకు టెక్నీషియన్స్ కి అలాగే యాంకర్స్, పార్టిసిపేట్స్ మధ్య వివాదాలు ఎక్కువవుతున్నాయి. ఇకపోతే యాంకర్ రవి - శ్రీ ముఖిఆ మధ్య గొడవ డోస్ కూడా పెరిగినట్లు వార్తలు వచ్చాయి, పటాస్ షో నుంచి శ్రీ ముఖి వెళ్లిపోవడానికి కారణం రవి అని టాక్ వచ్చింది. కొన్ని రోజుల అనంతరం రవికుడా షోకి దూరమయ్యాడు. గొడవల ఎంతవరకు నిజం అనే రూమర్స్ పై ఇటీవల రవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

రవి మాట్లాడుతూ.. శ్రీ ముఖికి నాకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు,. ఆమె నా వల్ల షో నుంచి వెళ్లిపోలేదు. ఆమె పర్సనల్ రీజన్స్ తోనే తప్పుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ లోకి వెళ్ళింది. శ్రీ ముఖి మంచి కో యాంకర్. ఒక్క పంచ్ వేస్తే.. వెంటనే కౌంటర్ గా పది పంచ్ లు వేస్తుంది. ఇప్పటికి కూడా ఆమె నాకు మంచి ఫ్రెండ్. శ్రీ వెళ్ళిపోయినా తరువాత డైరెక్టర్ సంతోష్ కూడా వెళ్ళిపోయాడు.

ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ప్రస్తుతం చేస్తున్న దాన్ని పక్కన పెట్టడం కామన్. అలాగే శ్రీ ముఖి బిగ్ బాస్ కమిట్మెంట్ కోసం వెళ్లిందని అనుకుంటున్నా. నేను కూడా అలాంటి ఆలోచనతోనే బయటకు వచ్చేశాను. అంతే గాని మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎన్నిసార్లు సమాధానం ఇచ్చినా వార్తలు రాసేవాళ్ళు అబద్దాలు రాస్తూనే ఉన్నారు. అందుకే అనవసరంగా స్పందించడం ఎందుకని కొన్నిసార్లు పట్టించుకోవడం లేదని రవి వివరణ ఇచ్చాడు