యాంకర్ అనే పదానికి కొత్త అర్ధాన్ని తెచ్చిన వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. నటిగా కెరీర్ మొదట్లో ఎన్నో ప్రయత్నాలు చేసిన అమ్మడు అంతగా క్లిక్ అవ్వలేకపోయింది. ఇక ఎప్పుడైతే రష్మీ జబర్దస్త్ లోకి వచ్చిందో అప్పటి నుంచి ఆమె కెరీర్ మారిపోయింది. షో క్లిక్కవ్వడంలో రష్మీ గ్లామర్ కూడా ఉపయోగపడింది.  అయితే ఎలా ఉన్నా ఈ సోషల్ మీడియా ప్రపంచంలో నెగిటివ్ కామెంట్స్ తప్పవు.

వాటిని చాలా వరకు అవాయిడ్ చేసే రష్మీ ఇటీవల ఒక నెటిజన్ చేసిన కామెంట్ కి ఎవరు ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చింది. కరోనా వైరస్ కంటే దారుణంగా రష్మీ చేస్తున్న ఒక షో సమాజానికి కీడుగా మారిందని నెటిజన్ చేసిన కామెంట్ కి రష్మీ ఈ విధంగా స్పందించింది.

 

'మీ చేతులు, కాళ్లు క‌ట్టేసి టీవీ ముందు కూర్చోపెట్ట‌డం లేదు కదా. ఆ కార్యక్రమం నచ్చకుండే కళ్ళు మూసుకోండి. నచ్చని వాళ్ళు చూడకుంటే మంచిది. లేదంటే ఛానల్ మార్చండి. ఆడియెన్స్ సపోర్ట్ వల్లే ఈ ప్రోగ్రామ్ కి అంతగా పేరొచ్చింది. అందుకే అంత హిట్ అయ్యింది. లేదంటే మీరు ఏమైనా సినిమా తీస్తే అందులో నాకు సతీ సావిత్రి పాత్రను ఇవ్వండి. అంతేగాని నేను సెలెక్ట్ చేసుకున్న పనిపై ప్రశ్నలు వేయకండి' అంటూ.. నాకు వచ్చిన అవకాశాలే చేసుకుంటూ మీ లాగే నా వర్క్ ని ఆస్వాదిస్తున్నానని రష్మీ ఆన్సర్ ఇచ్చింది.