Asianet News TeluguAsianet News Telugu

నానికి పోటీగా వస్తోన్న యాంకర్ ప్రదీప్!

'గ‌డ‌స‌రి అత్త సొగసరి కోడలు' టీవీ షోతో పాపులర్ అయిన ప్రదీప్ ఆ తరువాత 'కొంచెం ట‌చ్‌లో ఉంటే చెప్తా' షోలతో సహా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రదీప్ హీరోగా కూడా మారాడు. 

Anchor Pradeep to compete with Nani
Author
Hyderabad, First Published Mar 10, 2020, 2:12 PM IST

టాలీవుడ్ యాంకర్ లో ప్రదీప్ మాచిరాజు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై అతడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'గ‌డ‌స‌రి అత్త సొగసరి కోడలు' టీవీ షోతో పాపులర్ అయిన ప్రదీప్ ఆ తరువాత 'కొంచెం ట‌చ్‌లో ఉంటే చెప్తా' షోలతో సహా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ఇప్పుడు ప్రదీప్ హీరోగా కూడా మారాడు. తను హీరోగా పరిచయమవుతున్న సినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?'. మున్న అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈ సినిమాలో తమిళ అమ్మాయి అమృత హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమాలో ఒక పాటని రిలీజ్ చేశారు.

'నీలి నీలి ఆకాశం' అనే ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో దర్శకనిర్మాతలు సినిమాని గ్రాండ్ గా విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నెల 25న ఉగాది కానుకగా నాని-సుధీర్ బాబు నటించిన 'వి' సినిమా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.

ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా ప్రదీప్ సినిమాని రిలీజ్ చేయాలనుకోవడం సాహసమనే చెప్పాలి. అయితే ప్రదీప్ సినిమాని గీతా ఆర్ట్స్-యువి క్రియేష‌న్స్ సంస్థ‌లు కావ‌డం విశేషం. మరి నాని సినిమా ముందు ప్రదీప్ సినిమా బాక్సాఫీస్ ముందు నిలవగలదో లేదో చూడాలి!


 

Follow Us:
Download App:
  • android
  • ios