టాలీవుడ్ ప్రముఖ యాంకర్ లలో ఝాన్సీ ఒకరు. నటిగా, యాంకర్ గా ఝాన్సీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. కేవలం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా.. సామజిక కార్యక్రమాలకు కూడా ఆమె యాంకరింగ్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఝాన్సీ బిగ్ బాస్ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా బిగ్ బాస్ షోకు విశేష ఆదరణ లభిస్తోంది. తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. రెండవ సీజన్ కు నాని, మూడవ సీజన్ కు కింగ్ నాగార్జున హోస్ట్ గా రావడం విశేషం. త్వరలో నాల్గవ సీజన్ కు రంగం సిద్ధం కానుంది. 

42 ఏళ్ల వయసులో తల్లైన బాలయ్య హీరోయిన్.. క్యూట్ పిక్ వైరల్

విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు దాదాపు 100 రోజుల పాటు  బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకే ఇంట్లో వారు ఎలా వ్యవహరిస్తారనేది బిగ్ బాస్ కాన్సెప్ట్. 

బిగ్ బాస్ 4 లో ఛాన్స్ వస్తే వెళతారా అని యాంకర్ ఝాన్సీని ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 1 లో మొట్ట మొదట ఛాన్స్ వచ్చింది నాకే.. అప్పుడే చేయనని చెప్పా. ఇప్పుడు అస్సలు వెళ్ళను. తెలిసి తెలిసి రాయితో మన పళ్లే ఊడగొట్టుకోవడం ఎందుకు. బిగ్ బాస్ హౌస్ లో నాలుగు గోడల మధ్య నన్ను నేను భాదపెట్టుకోలేను అని ఝాన్సీ అన్నారు. 

ఝాన్సీ మాటలబట్టి చూస్తే ఆమె బిగ్ బాస్ హౌస్ ని ఒక జైలు లాగా ఫీల్ అవుతోందని అర్థం అవుతోంది.