బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వార్. క్రేజీ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన మల్టీస్టారర్ మూవీ ఇది.  దేశవ్యాప్తంగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ యాక్షన్ మూవీ విడుదలయింది. ఈ చిత్రంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ కళ్ళు చెదిరే విన్యాసాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. 

ఈ చిత్రంలో పొడుగు సుందరి వాణి కపూర్ హీరోయిన్ గా నటించింది. వాణికపూర్ పెర్ఫామెన్స్, అందాలకు మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ప్రముఖ నటి, యాంకర్ అయిన భావన బాలకృష్ణన్ ప్రశంసలు కురిపించింది. 

ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు, స్టంట్స్, అద్భుతంగా తీర్చిదిద్దిన ఫైట్ సీన్స్ చాలా బావున్నాయి. ఇవన్నీ పురుషులని ఆకర్షించే అంశాలు. ఇక వార్ మూవీలో మహిళలకు నచ్చే అంశం హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ అని యాంకర్ భావన పేర్కొంది. హృతిక్ రోషన్ తన వీర్యాన్ని దానం చేస్తే బావుంటుంది అని షాకింగ్ కామెంట్స్ చేసింది. 

హృతిక్ రోషన్ లాంటి హీరోలు చాలా మంది ఉండాలనేది ఆమె కోరిక కావచ్చు. కానీ భావన చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ తో ఆమె ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. హృతిక్ రోషన్ కు ఆల్రెడీ పెళ్లయింది. ఇలాంటి కామెంట్స్ ని ఓ యాంకర్ చేస్తే అతడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. బోల్డ్ కామెంట్స్ చేసే ముందు కాస్త ఆలోచించాలి అని హృతిక్ అభిమానులు పేర్కొంటున్నారు.