ప్రముఖ టీవీ యాంకర్ అనసూయకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది హీరోయిన్లకు కూడా ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండదు కానీ అనసూయ అంటే మాత్రం జనాల్లో మంచి క్రేజ్ ఉంది. యాంకర్ గానే కాకుండా నటిగా కూడా కొన్ని సినిమాల్లో నటించిన తనఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంది.

సోషల్ మీడియాలో ఆమెకి  ఉన్న ఫాలోవర్స్ ని చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. ఆమె పెట్టే ఫోటోలకు లక్షల్లో లైకులు వస్తుంటాయి. ఆమె మీద ఉన్న పిచ్చి అభిమానంతో  తాజాగా అభిమానులు ఆమెకి చుక్కలు చూపించారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభించడానికి అనూసుయ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వెళ్లారు. ఆమెకి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

అనసూయ సంప్రదాయ దుస్తులు ధరించి షాప్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. ఆమె వస్తుందని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో మాల్ దగ్గరకి చేరుకున్నారు. ఆ జనం నుండి  తప్పించుకొని మాల్ దగ్గరకి వెళ్లడం అనసూయకి చాలా కష్టమైపోయింది. ప్రతీ ఒక్కరూ అనసూయతో సెల్ఫీ దిగడానికి పోటీపడ్డారు.

వాళ్లు ఎంతగా విసిగించినా అనసూయ మాత్రం తన సహనాన్ని కోల్పోకుండా ఓపికగా సెల్ఫీలు ఇచ్చింది. కొంత మంది వద్ద తానే సెల్‌ఫోన్లు తీసుకుని సెల్ఫీలు తీశారు.అయితే షాపింగ్ వాళ్లు మాత్రం అనసూయని అభిమానుల నుండి కాపాడడానికి చాలా కష్టపడ్డారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Thank you #Amalapuram🌴 ❤️ You were a crazy loving crowd!!! See you again whenever possible!!! 😍🥰

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on Oct 4, 2019 at 12:41am PDT