Asianet News TeluguAsianet News Telugu

అనసూయకు మెగా ఆఫర్,మామూలుగా లేదుగా

 రామ్ చరణ్ తో చేసిన రంగస్దలం సినిమాతో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది. అందులో రంగమ్మత్తగా దుమ్ము రేపింది. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలోనూ ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ చేస్తోంది. 

Anasuya in Chiranjeevis god father movie
Author
Hyderabad, First Published Aug 24, 2021, 8:58 AM IST

యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఏం చేసిన అది సెన్సేషనే. పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌కు గ్లామర్‌ అద్దిన ఈ యాంకర్ తన అందచందాలతోనే కాకుండా నటనతో సినిమాల్లోనూ బిజీ అవుతోంది. అటు బుల్లితెరను, ఇటు పెద్ద తెరను మ్యానేజ్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ముఖ్యంగా మెగా క్యాంప్ సినిమాల్లో ఆమె ఖచ్చితంగా ఉంటోంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. 

మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఆమె స్వయంగా ఈ విషయం ఖరారు చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాధర్ చిత్రంలో ఆమె ఓ కీలకమైన పాత్ర చేస్తోంది. రామ్ చరణ్ తో చేసిన రంగస్దలం సినిమాతో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది. అందులో రంగమ్మత్తగా దుమ్ము రేపింది. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలోనూ ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ చేస్తోంది. 
  
రీసెంట్ గా మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అనసూయ తనకు చిరంజీవిపై అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. చిరంజీవి గారంటే ఆమెకు ఎంతో అభిమానం అని, ఆయన పేరు చెబితేనే భక్తితో కూడా మర్యాద కలుగుతుందని అన్నారు. అలాగే చిరంజీవి, రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేసిన రంగస్థలం సినిమా ఫంక్షన్ కి వచ్చినప్పుడు అనసూయ యాక్టింగ్ తో పాటు తాను చేసిన పాత్రను మెచ్చుకున్నారని అన్నారు.

బుల్లితెర వ్యాఖ్యాతగానే కాకుండా రంగమ్మత్తగానూ ప్రేక్షకులకు చేరువైన ఈ నటి.. సినిమాల్లో కీలకపాత్రలు పోషించడంతో పాటు అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్ లలో మెరుస్తున్నారు. ఈ క్రమంలోనే కార్తికేయ హీరోగా తెరకెక్కిన ‘చావుకబురు చల్లగా’లో మెప్పించారు. కాగా, అనసూయ మరోసారి సినీ ప్రియుల్ని అలరించనున్నట్లు సమాచారం. శర్వానంద్‌, సిద్దార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మహాసముద్రం’లో ఆమె స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే చిత్రబృందం అనసూయను సంప్రదించినట్లు సమాచారం. దీంతో ‘మహా సముద్రం’లో అనసూయ భాగమైందని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. 

 ప్రస్తుతం చిరు.. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ తెలుగు రీమేక్‏కు గాడ్ ఫాదర్ అనే టైటిల్ యాప్ట్ గా ఉంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

అలాగే చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇందుల కాజల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios