ప్రముఖ టాలీవుడ్ యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ గా చలాకీగా ఉంటూనే అందాల చందాలతో సైతం  ఆకర్షిస్తోంది. హీరోయిన్లని తలదన్నే అందంతో ఆకర్షిస్తున్న అనసూయకు వెండితెరపై మంచి అవకాశాలు వస్తున్నాయి. 

క్షణం, రంగస్థలం లాంటి చిత్రాల్లో అనసూయ తిరుగులేని నటన కనబరిచింది. టాప్ యాంకర్ గా రాణిస్తూనే నాటిదా అద్భుతమైన పత్రాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీనితో అనసూయ కూడా ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో  సమయం గడుపుతోంది. అనసూయ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

తాజాగా అనసూయ సోషల్ మీడియాలో తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఇతడే అంటూ ఓ  చేసింది. ఆ పిక్ చూసిన నెటిజనులు షాకవుతున్నారు. కానీ అనసూయ పెట్టిన కామెంట్ తో అందరికి క్లారిటీ వచ్చింది వచ్చింది. ఇతడు నా మొదటి బాయ్ ఫ్రెండ్ మాత్రమే కాదు.. రెండవ, మూడవ.. ఇప్పటివరకు ఇతడే నా బాయ్ ఫ్రెండ్.. భవిష్యత్తులో కూడా ఇతడే.. అతడే నా భర్త అంటూ అనసూయ ట్విస్ట్ ఇచ్చింది. 

అనసూయ షేర్ చేసింది తన భర్తతో ప్రేమలో ఉన్నప్పటి పిక్ అది. ఇద్దరూ యంగ్ గా ఉండడంతో నెటిజన్లకు గుర్తుపట్టడం కాస్త కష్టంగా ఉంది.