బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకకమైన స్దానాన్ని ఏర్పాటు చేసుకుని, ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందం అనసూయ. అక్కడ సక్సెస్ కేరాఫ్ గా చూపించి వెండితెరపై కూడా రాణిస్తోంది. అడవి శేష్ తో చేసిన 2016లో చేసిన ‘క్షణం’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ఆ తర్వాత ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా కుర్రకారు గుండెల్లో నిలిచిపోయారు. ఈ నేపధ్యంలో  ఆమె మరింత బిజీ అయ్యింది. వరసపెట్టి సినిమా అవకాశాలు పెరుగుతున్నాయి.దాంతో వెంకటేష్ చిత్రం ‘F2’లో ఓ పాటలో కనపడింది. వైయస్ పాదయాత్ర ను బేస్ చేసుకుని చేసిన‘యాత్ర’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది.

అయితే  ‘రంగస్థలం’ తర్వాత ఆమెకు పెద్ద సినిమా ఆఫర్స్ ఏమీ రాలేదు. అన్ని చిన్న సినిమాలే. పెద్ద సినిమాలతో వచ్చే గుర్తింపు వేరే. ఆమె లాంటి నటికి బూస్ట్ ఇచ్చేవి రంగమ్మత్త తరహా లెంగ్త్ ఉన్న పాత్రలే. కానీ ఎందుకనో పెద్ద సినిమా దర్శక,నిర్మాతల దృష్టి ఆమెపై పడలేదు.  అనసూయ ప్రధాన పాత్ర పోషించిన ‘కథనం’ సినిమా విడుదలై డిజాస్టర్ అయ్యింది. రీసెంట్ గా రిలీజైన మీకు మాత్రమే చెప్తా సినిమా సైతం ఆమెకు కలిసి రాలేదు. ఆ సినిమా భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాకపోవటంతో అనసూయకు ఏం చేయాలో తెలియలేదు.

ఈ నేపధ్యంలో ఆమె పాత్రల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటోంది. అందుకోసం ఆమె ఏ సినిమా పడితే అవి ఒప్పుకోవటం లేదట. అయితే ఇన్ని ప్లాఫ్ లు వచ్చినా అనసూయకు  ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నా యని సమాచారం. వాటిలో సుకుమార్ నుంచి వచ్చిన ఓ  ఆఫర్ ఉందని వినికిడి.  ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రను తనకు ఇచ్చిన దర్శకుడు సుకుమార్ ఇప్పుడు మరో రోల్‌ను అనసూయ కోసం రెడీ చేశారట. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ఒక సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అనసూయకు ఓ మంచి పాత్రను సుకుమార్ ఆఫర్ చేశారని చెప్తున్నారు. ఈ వార్త నిజమే అయ్యితే అనసూయ టైమ్ బాగున్నట్లే..కెరీర్ మరింత ముందుకు వెళ్లుంది!