తనదైన శైలిలో తన ప్రౌఢ అందాలను ఆరబోస్తూ.. అందరికంటే ముందుకు దూసుకుపోతూ.. అవకాశాలతో దూసుకుపోతోంది అనసూయ.  సినీ పరిశ్రమలో వరస ఆఫర్స్ ని ఇట్టే పట్టేస్తుంది. జబర్దస్త్‌లో యాంకర్‌గా ఓ వెలుగు వెలిగిన అనసూయ.., రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తో హైట్స్ కు వెళ్లిపోయింది. ఆ సినిమా తర్వాత ఆమె ఖాళీ లేనంత బిజీ అయ్యింది. ఏ పాత్ర అయినా.. అనసూయ అందులో ఒదిగిపోతుంది అనే పేరు తెచ్చుకుంది.

ఈ ఏడాది కూడా పలు భారీ ప్రాజెక్టుల్లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తోంది. పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ హీరోగా విజయ్‌ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో అనసూయ కీ రోల్ పోషించింది. ఇప్పుడు సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలోనూ నటిస్తోంది. పవన్‌-క్రిష్‌ తీయబోతున్న సినిమాలోనూ అనసూయకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా వరస సినిమాలతో అనసూయ ఫుల్ బిజీగా ఉంటోంది.

అయినా టీవీ స్క్రీన్‌పై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ.. ఈ బ్యూటీ వరస  సినిమా వెనక కారణం ఏమిటనేది ఇండస్ట్రీలో చర్చగా మారింది. అయితే అందుకు కారణం ఆమె నటనా కౌశలం అనేది ఒకటేతే...ఆమె కు ఆల్టన్నేటివ్ గా చేసే వారు దొరక్కపోవటమే అంటున్నారు. రీసెంట్ గా నితిన్..అంధాధున్ చిత్రం రీమేక్ లో మొదట టబునే తీసుకుందామనుకున్నారు. కానీ ఆమె చెప్పిన రెమ్యునేషన్ కు కంగారుపడ్డ నిర్మాతలు అనసూయతో చేయటానికి సిద్దపడుతున్నారు. అలా చాలా ఆఫర్స్ ..ఆమె రెమ్యునేషన్, డేట్స్ విషయంలో ప్లెక్సిబులిటీగా ఉండటంతో వస్తున్నాయంటున్నారు. అంతేకాకుండా ఆమెకు బి,సి సెంటర్లలో ఉన్న క్రేజ్ కూడా వరస ఆఫర్స్ కు కారణం అంటున్నారు.