Asianet News TeluguAsianet News Telugu

ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ఓకే చేశాడు!

ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ లో ఉన్నఆనంద్ తన మూడో సినిమాగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ కథను ఎంచుకున్నాడు. షార్ట్ ఫిలిం మేకర్ దామోదర అట్టాడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 

Anand Deverakonda's third film is announced
Author
Hyderabad, First Published Oct 7, 2019, 4:19 PM IST

‘దొరసాని’ చిత్రంతో తెరంగేట్రం చేసిన హీరో ఆనంద్ దేవరకొండ నటించబోయే మూడో సినిమా అనౌన్స్ అయింది. ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ లో ఉన్నఆనంద్ తన మూడో సినిమాగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ కథను ఎంచుకున్నాడు. షార్ట్ ఫిలిం మేకర్ దామోదర అట్టాడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టాంగాప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి (యూ.ఎస్.ఏ) బ్యానర్ పై విజయ్ మట్టపల్లి, ప్రదీప్ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విజయ దశమి సందర్భంగా ఈ చిత్రం అనౌన్స్ మెంట్ జరిగింది. ఈ సందర్భంగా...

నిర్మాతల్లో ఒకరైన విజయ్ మట్టపల్లి మాట్లాడుతూ.. "పలు షార్ట్ ఫిలింస్ తో ఆకట్టుకున్న దామోదర అట్టాడ ఓ మంచి కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీతో వచ్చాడు. ఈ కథ హీరో ఆనంద్ దేవరకొండ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. కామెడీ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో ఆనంద్ లుక్ కూడా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. త్వరలోనే వాళ్ల పేర్లు ప్రకటిస్తాం. ఈ సినిమాతోముగ్గురు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ కు పరిచయంకాబోతున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.నవంబర్ లోరెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" అన్నారు.

టెక్నికల్ టీమ్:
సినిమాటోగ్రఫీ: మదన్ గుణదేవా
మ్యూజిక్: అమిత్ దాసాని,సిద్దార్థ్ సదాశివుని, రామ్ మిరియాల
ఆర్ట్: నీల్
నిర్మాతలు: విజయ్ మట్టపల్లి,ప్రదీప్ ఎర్రబెల్లి
రచన-దర్శకత్వం: దామోదర అట్టాడ.

Follow Us:
Download App:
  • android
  • ios