Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్: ఆ పాత సినిమా రీమేక్ లో ఆనంద్ దేవరకొండ..?

తొంభైలలో వచ్చి హిట్టైన ఈవీవీ సత్యనారాయణ చిత్రం ‘తాళి’ రీమేక్‌లో ఆనంద్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జనరేషన్ కు తగ్గ మార్పులు , చేర్పులుతో ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నారట.  

Anand Devarakonda to remake '90s  hit movie Thali?
Author
Hyderabad, First Published Nov 20, 2019, 11:29 AM IST

‘దొరసాని’ చిత్రంతో పరిచయమయ్యాడు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. నూతన దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన తెలంగాణ నేపథ్యంలోని రూపొందిన ఈ చిత్రానికి అందమైన ప్రేమ కథ అంటూ మంచి స్పందనలే వచ్చినా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. మరో ప్రక్క ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ‘దొరసాని’.. శివాత్మిక రాజశేఖర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఈ నేపద్యంలో ఆనంద్ దేవరకొండ తను తర్వాత చేసే చిత్రాల విషయంలో జాగ్రత్తపడుతున్నారు. ఆచి తూచి, తన అన్న సలహాలు తీసుకుంటూ అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఆనంద్ రెండో చిత్రం చేస్తున్నారు. తాజాగా ఆయన మూడో చిత్రం కథ గురించి ఓ చిత్రమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
 
తొంభైలలో వచ్చి హిట్టైన ఈవీవీ సత్యనారాయణ చిత్రం ‘తాళి’ రీమేక్‌లో ఆనంద్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జనరేషన్ కు తగ్గ మార్పులు , చేర్పులుతో ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నారట.  ఈ మేరకు ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారట. అలాగే  ఈ సినిమా స్క్రిప్ట్ ఆనంద్ దేవరకొండకు బాగా నచ్చిందని.... ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడని, అందులో పాత్ర తనకు ఛాలెంజింగ్‌గా ఉండబోతుందని ఫీల్ అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి.

వింటానికి వెరైటీగా అనిపించినా...ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే తాళి సబ్జెక్టు ఈ కాలానికి ఎన్ని మార్పులు చేసినా వర్కవుట్ అయ్యే వ్యవహారం కాదు. మరీ ముఖ్యంగా ఇవివి మార్క్ కామెడీని తిరిగి రీక్రియేట్ చేయటం చాలా చాలా కష్టం. మరి ఆనంద్ దేవరకొండ ఈ విషయమై ఏం డెసిషన్ తీసుకుంటాడో చూడాలి. నిజంగా కనుక తాళి సినిమాని రీమేక్ చేసి హిట్ కొడితే, సెన్సేషనే. మరన్ని అప్పటి చిత్రాలు ఈ కాలంలోకి ప్రయాణం పెట్టుకుంటాయనటంలో సందేహంలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios