తెలుగులో హైలీ సక్సెస్ ఫుల్ సీరియల్ ...అమృతం మరోసారి సీక్వెల్‌తో మన ముందుకు వస్తోంది. గతంలో ఈ సీరియల్ లో  భాగమైన హర్షవర్ధన్‌, శివ నారాయణ, వాసు ఇంటూరిలతో పాటు ఈ సారి ఎల్బీ శ్రీరామ్‌, సత్యకృష్ణ మనల్ని నవ్వించడానికి చేతులు కలిపారు. ఈ ద్వితీయ భాగంకి ఎప్పటిలాగే గంగరాజు కలం పట్టగా, సందీప్‌ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. గంగరాజు , సందీప్‌ సంయుక్తంగా లైట్‌ బాక్స్‌ మీడియా బ్యానర్‌ లో ఈ ఉగాదికి అంటే 25 మార్చిన నవ్వించడానికి జీ5 ఉన్న వారి ఇంటికి వస్తున్నారు.

ఇక అంజి పాత్రలో కనిపించిన గుండు హనుమంతరావు మరణించటంతో ఆ ప్లేస్ లో ఎల్బీ శ్రీరామ్ ని తీసుకున్నారు. ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో అమృతం వేసే పాత్ర ధారులు మారుతూ వచ్చారు. కానీ అంజి మాత్రం అలాగే ఉండిపోయారు.

అంతలా అంజి పాత్రలో తనదైన ముద్ర వేసారు గుండు హనుమంతరావు.  దాంతో ఎవరీ పాత్రకు సూట్ అవుతారు అని రకరకాలుగా ఆలోచించి చివరకు ఎల్బీ శ్రీరామ్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఇక ఈ ఎపిసోడ్ కు అమృతం ద్వితీయం అనే పేరు పెట్టారు. అలాగే కాప్షన్ ..మూర్ఖత్వానికి మరణం లేదు.

ఇదిలా ఉంటే అమృతం రీరన్ ఇప్పటికే ఈటీవి ప్లస్ లో వస్తోంది.మంచి టీఆర్పీలు వస్తున్నాయి.మరో ప్రక్క యూట్యూబ్‌లో కూడా ఈ సీరియల్‌కు విశేష ఆదరణ లభించింది. ఒక్కో ఎపిసోడ్‌కు మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఇక ప్రస్తుతం జీ5 యాప్‌ ద్వారా అందుబాటులో ఉన్న ఈ ‘అమృతం’కు త్వరలోనే సీజన్ 2 రాబోతూండటంతో అందరిలో ఆసక్తి కలుగుతోంది. ఇక గతంలో ఉన్న నాలుగు క్యారెక్టర్లు (అమృతం, అంజి, సర్వం, అప్పాజీ)  ఆధారంగానే మన మనసులకు హత్తుకునే విధంగా డిజైన్ చేస్తున్నారట.