రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి అప్పట్లో అంటే 1983లో తాతినేని రామారావు దర్శకత్వంలో అంధా కానూన్ టైటిల్ తో ఓ సినిమా చేసారు. ఈ సినిమాతోనే రజనీకాంత్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అమితాబ్ ది గెస్ట్ రోల్ అయినా ఫిల్మ్ ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ కు ఎంపికయ్యారు. ఈ సినిమా విజయం సాధించటంతో  ఆతర్వాత రజనీ కొన్ని సినిమాలు చేసారు. ఇక ఈ సినిమా డబ్బింగ్ సమయంలో ..అమితాబ్ ఓ సలహా ఇచ్చారు రజనీకాంత్ కు. ఆ విషయాన్ని అప్పట్లో రజనీ మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు...

నేను సాధారణంగా వేగంగా మాట్లాడుతూంటాను. సినిమాల్లోనూ నాది అదే ధోరణి . అంధా కానూన్  సినిమాలో నేను ఆ విధంగానే హిందీ డైలాగులు  స్పీడుగా చెప్పటం అమితాబ్ బచ్చన్ గారు గమనించారు. నా డైలాగు డెలవరీ అంత వేగంగా ఉండకూడదని సూచించటానికి మరో ప్రక్క నేను ఆ సూచనకు నొచ్చుకోకుండా ఉండటానికి నవ్వుతూనే ఆయన ఇలా అన్నారు.

రజనీ....మీరు డైలాగులు కొంచెం స్పీడు తగ్గించి మెల్లిగా చెప్పాలి. మేము నార్త్ (ఉత్తిరాది)వాళ్లం  ...బద్దకస్తులం. ప్రతీదీ మేము మెల్లిగానే చేస్తూంటాము. అంచేత మీరు కూడా ...అలాగే చెప్తే బాగుంటుంది అంటూ సుతి మెత్తిగా విషయాన్ని సూచిస్తూ సలహా ఇచ్చారు. ఆ విషయం నాకు ఎంతకాలమైనా గుర్తిండిపోయింది అంటారు రజనీ. ఈ విషయాన్ని  రజనీకాంత్ నవంబర్ 82 నాటి మూవి అనే పత్రికలో షేర్ చేసుకున్నారు. ఇక అంధా కానూన్ తమిళంలో వచ్చిన హిట్ సినిమా రీమేక్. దాన్నే తర్వాత  తెలుగులో చిరంజీవి ..చట్టానికి కళ్ళు లేవు టైటిల్ తో రీమేక్ చేసారు.

కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లు  తమిళంలో నిలదొక్కుకున్నాకా..  హిందీలో సినిమా ప్రయత్నాలు  చేస్తూ వచ్చారు. బాలీవుడ్‌లో సోలో ప్రయత్నాలు కొన్ని, అలాగే అక్కడి స్టార్‌ హీరోలతో కలిసి నటించడం ఈ హీరోలు చేశారు. రజనీకాంత్‌, కమల్‌లు తెలుగులో ఎలా అయితే సినిమాలు చేశారో.. అదే విధంగా హిందీలోనూ వారు తమ ప్రయత్నాలను చేశారు.  రజనీ..హిందీలో కొన్ని డైరెక్ట్‌ సినిమాల్లో చేశాడు. అక్కడి స్టార్‌ హీరోలతో కలిసి నటించాడు.

అయితే 'భాషా' తర్వాత రజనీకాంత్‌కు కూడా వేర్వేరు లాంగ్వేజుల్లో నటించాల్సిన అవసరం లేకుండా పోయింది. తమిళంలో సినిమా చేస్తేచాలు అదే అన్ని భాషలనూ డబ్బింగ్ అవుతూ  వచ్చింది. దాంతో రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లు హిందీలో కూడా తమ సినిమాలకు తామే డబ్బింగ్‌ చెప్పుకుంటూ వచ్చారు.  అయితే హిందీలో సినిమా మేకింగ్‌కు ఎక్కువ రోజులు పట్టడం కూడా రజనీ అక్కడి సినిమాలు మానేయడానికి ఒక కారణం అని అంటారు.