టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి సాహో సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది. నార్త్ లో హిట్టయినా సౌత్ లో అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ కాకపోవడంతో 20వ ప్రాజెక్ట్ తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు 'ఓ డియర్' అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సగానికి చేరుకుంది. అయితే గాసిప్స్ రోజుకొకటి పుట్టుకొస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ వాటిపైన పెద్దగా స్పందించడం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకి ఎవరు మ్యూజిక్ అందిస్తారు అనే విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమాకు గతంలో అనుకున్న మ్యూజిక్ డైరెక్టరే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అయితే బెటర్ మరొకసారి అలోచించి యూవీ క్రియేషన్స్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

గతంలో అమిత్ తప్పుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ నిర్మాతలు మళ్ళీ అతనివైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. బాలీవుడ్ లో బిజీబిజీగా ఉండే అమిత్ త్రివేది టాలీవుడ్ లో కూడా సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు. గత ఏడాది సైరా సినిమాకు మ్యూజిక్ అందించిన అమిత్ ప్రస్తుతం  నాని 'V' సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ప్రభాస్ సినిమాకు కూడా మంచి మ్యూజిక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మరి తెలుగులో ఈ బాలీవుడ్ స్టార్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.