బాలీవుడ్ మెగాస్టార్  అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమితాబ్ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం రియాలిటీ షోలతో అలాగే పలు సినిమాలతో బిజీగా ఉన్న బిగ్ బి సడన్ పనులన్నిటికీ బ్రేక్ ఇచ్చేసి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మెగాస్టార్ చిక్కిత్స కోసం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. ఇటీవల హాస్పిటల్ కి బంధువులు సన్నిహితులు వస్తుండడంతో కొన్ని రూమర్స్ అభిమానులను షాక్ కి గురి చేశాయి. గత మూడు రోజుల నుంచి అమితాబ్ ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తోంది. ఐసీయూలోనే చిక్కిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే రూమర్స్  డోస్ పెరగకముందే వైద్యులు క్లారిటీ ఇచ్చారు.

రెగ్యులర్ చెకప్స్ దృష్ట్యా అమితాబ్ అడ్మిట్ అయ్యారని, త్వరలోనే ఆయన్ను డిశ్చార్జ్ అవుతారని కూడా వైద్యులు వివరణ ఇచ్చారు.  ఇటీవల సైరా సినిమాతో అమితాబ్ తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ నటించిన ఆ హిస్టారికల్ మూవీ బాలీవుడ్ లో మాత్రం అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఆ సినిమాను రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ లో నిర్మించారు.