బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న అమితాబ్‌ రోజు ఆసక్తికర పోస్ట్‌లతో అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ఓ ఫన్నీ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బిగ్ బీ. తాను ఇన్నర్‌వేర్‌తో ఓ పాత ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసిన అమితాబ్ ఫన్నీ కామెంట్ చేశాడు.

`యంగ్‌ జనరేషన్‌కు వచ్చినట్టుగా ఇన్‌స్టాలో ఎక్కువగా ఫాలోవర్స్‌, కామెంట్స్‌ నాకు ఎందుకు రావటంలొ లేదో కొంతమంది వివరించారు. ఎందుకంటే నేను బికినీలో ఫోటో పెట్టడం లేదు. అందుకే నట. అప్పుడు నాకు ఈ ఫోటో గుర్తుకు వచ్చింది. ఇది నా మహాన్‌ సినిమాలోని స్టిల్‌. నేను త్రిపుల్ రోల్‌ పోషించిన ఈ సినిమా రిలీజ్‌ అయి 37 సంవత్సరాలు అవుతోంది` అంటూ కామెంట్ చేశాడు బిగ్ బీ.

బిగ్‌ బీ చేసిన ఈ పోస్ట్‌కు సూపర్బ్ రెస్సాన్స్ వస్తోంది. పలు సెలబ్రిటీలు సైతం పోస్ట్ పై రియాక్ట్ అయ్యారు. లాఫింగ్ ఎమోజీలతో తమ రెస్సాన్స్‌ను వ్యక్తపరిచారు. కరోనా కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన అమితాబ్ అభిమానులకు కష్టకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా సోషల్ మీడియా ద్వారా వివరిస్తున్నాడు. అదే సమయంలో తన వంతుగా పేదలకు సాయం అందిస్తున్నాడు.