బాలీవుడ్ దిగ్గజాలు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ 24 గంటల వ్యవధిలో ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. దీనితో వారి కుటుంబ సభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా రిషి కపూర్ అంత్య క్రియలకు కుటుంబసభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.  

బిగ్ బి అమితాబ్ బచ్చన్, రిషి కపూర్ మంచి స్నేహితులు. వీరిద్దరూ కలసి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అందులో ముఖ్యమైనవి అమర్ అక్బర్ ఆంటోని, కభీ కభీ చిత్రాలు ఉన్నాయి. 

రిషి కపూర్ మరణించిన వెంటనే తాను కుప్పకూలిపోయాను అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. కానీ వెంటనే ఆ ట్వీట్ ని డిలీట్ చేశారు. దీనితో అమితాబ్ తన మిత్రుడు గురించి ఇంకేదో చెప్పాలని భావిస్తున్నట్లు అభిమానులు అనుకున్నారు. తాజాగా అమితాబ్ రిషి కపూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

రిషి కపూర్ అనారోగ్యంతో చికిత్స చేయించుకుంటుండగా తాను ఒక్కసారి కూడా రిషి కపూర్ ని పరామర్శించలేదు అని అమితాబ్ అన్నారు. అందుకు గల కారణాన్ని అమితాబ్ వివరించారు. రిషి కపూర్ ని అనారోగ్యంతో చూడడం నాకు ఇష్టం లేదు. నేను రిషి కపూర్ ని నీరసంగా ఎప్పుడూ చూడలేదు. 

టాలీవుడ్ మోడ్రన్ హీరోయిన్ల సత్తా ఇదే.. ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాలు

ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే రిషి కపూర్ ముఖమే నాకు గుర్తు. అతడిని అలాగే గుర్తుంచుకుంటా అని అమితాబ్ అన్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా రిషి కపూర్ నాతో ఫోన్ లో మాట్లాడేవాడు. అతడి ఆరోగ్య సమస్యలని ఏమాత్రం చెప్పువాడు కాదు. నాతో ఉత్సాహంగానే మాట్లాడేవాడు. 

రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చా. అంతకు మించి ఏమీ లేదు. త్వరలోనే వస్తా.. కలుద్దాం అని చెప్పేవాడు అంటూ అమితాబ్ రిషి కపూర్ గురించి చెప్పుకొచ్చారు.