Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్: జెనీలియా బావకు మంత్రి పదవి

మహారాష్ట్ర లో ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేసి చాలా రోజులే గడుస్తోంది. కేవలం అప్పట్లో 6గురు మంత్రులతో మాత్రమే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన ఉద్ధవ్ ఇప్పుడు మంత్రివర్గాన్ని విస్తరించేందుకు పూర్తి ఏర్పాట్లు చేసారు. 

Amit Deshmukh to be sworn as a maharastra Minister
Author
Hyderabad, First Published Dec 30, 2019, 12:04 PM IST

నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు ముహుర్తాన్ని ఖరారు చేసారు.  ఇకపోతే ఈ మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్- ఎన్సీపీ-శివసేనల కూటమి నుండి నేడు ప్రధాన నేతలంతా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేడు జరగబోయే విస్తరణలో తెలుగు నాట స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన జెనీలియా బావ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనుండడం విశేషం.

లాతూర్ సిటీ నుండి వరుసగా మూడవసారి నెగ్గిన అమిత్ దేశ్ ముఖ్ నేడు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీనుండి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఈ ల్లో దేశ్ ముఖ్ కుటుంబ సభ్యులు కూడా పోటీ చేశారు. అమిత్ దేశ్ముఖ్(కాంగ్రెస్) లాతూర్ లో, ధీరజ్ దేశ్ముఖ్ లాతూర్(గ్రామీణం)లో నామినేషన్లు వేశారు.

జెనీలియా ప్రచారం.. విజయఢంకా మోగించిన దేశ్ ముఖ్ సోదరులు!

వీరి తరఫున ఎన్నికల్లో వారి సోదరుడు, ప్రముఖ హీరో రితేష్ దేశ్ ముఖ్, అతడి భార్య జెనీలియా ప్రచారం చేశారు. వారు పోటీ చేసిన నియోజకవర్గాలకు వెళ్లి తమవంతుగా ప్రచారం చేశారు. పోలింగ్ రోజు రితేష్, జెనీలియాలతో పాటు మొత్తం కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

ఇక నేడు మొదలైన ఎన్నికల కౌంటింగ్ లో మొదటి నుండి ముందంజలో ఉన్న దేశ్ ముఖ్ సోదరులు విజయకేతనం ఎగురవేశారు. త్వరలోనే జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేసిన తన తండ్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంటూ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ ఎన్నికల్లో పోటీ చేస్తాడని అన్నారు.

హిట్టు కథలతో బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయిన తెలుగు దర్శకులు

విలాస్ రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర రాజకీయాల్లో పట్టున్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో ముఖ్యనేత. 1999 నుంచి 2008 మధ్యకాలంలో రెండుసార్లు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.2012లో అనారోగ్యంతో మరణించారు. విలాస్‌రావ్ సీఎంగా ఉన్న కాలంలోనే.. ఆయన కుమారుడు రితేశ్ ను బాలీవుడ్ హీరోగా పరిచయం చేశారు.

ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయిన రితేశ్ 2012లో అప్పటికి స్టార్ హీరోయిన్ గానే వెలుగొందుతున్నజెనీలియాను పెళ్లిచేసుకున్నారు. అదే ఏడాదిలో తండ్రి విలాస్ రావ్ మరణించారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రితేష్ పోటీ చేస్తాడనే మాటలు బలంగా వినిపించాయి. కానీ రితేష్ మాత్రం తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదంటాడు. తన సోదరుల రాజకీయ ఎదుగుదలకు మాత్రం తన వంతు సహాయం చేస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios